జీఓ 151 వర్తింపజేయాలంటూ ధర్నా
కాకినాడ సిటీ :
వేతనాల పెంపు జీఓ 151 వర్తింప చేయాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ రెండవ ఏఎన్ఎంల యూనియన్ గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన అర్హతలతో వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు అరకొర వేతనాలు ఇచ్చి వేతన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంçపునకు సంబంధించి జీఓ నంబర్ 151ని తక్షణం సెకండ్ ఏఎన్ఎంలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవీ రమణ, డీఏ రత్నరాజ్లు సంఘీభావం తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతలక్ష్మి, జీఎన్ వరలక్ష్మి పాల్గొన్నారు.