GO issue
-
Telangana: జీవో 111 పై హైకోర్టులో విచారణ
-
Telangana: జీవో 111 పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: జీవో నంబర్ 111 అంశానికి సంబంధించి ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ చేపట్టి నాలుగేళ్లయినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు నిలదీసింది. ఈ జీవోపై గురువారం విచారణ సందర్భంగా.. అసలు నివేదిక జాప్యం వెనక రహస్య అజెండా ఏంటని సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కాగా, దీనిపై ప్రభుత్వ అదనపు ఏజీ రామచంద్రరావవు.. కరోనా, తదితర కారణాల వల్ల ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ధర్మాసనం.. ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సెప్టెంబర్ 13 లోగా ఇవ్వాలని సూచించింది. ఒకవేళ నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని కమిటీకి ఆదేశించింది. నివేదికను వెబ్సైట్లో పెట్టాలని కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. చదవండి: Work From Home: జనవరి వరకు ఊరట.. ఇప్పుడు ఎంప్లాయిస్ మరో మాట! -
నిధుల దోపిడీకి పచ్చజెండా?
బి.కొత్తకోట: జిల్లాలో 2005 నుంచి 2009 వరకు హంద్రీ–నీవా సహా మిగిలిన ప్రాజెక్టుల పనులు చేపట్టి పూర్తిచేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్లకు అదనపు నిధులు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులను ఇటీవల జారీ చేసింది. 2014 తర్వాత నుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు వర్తించదు. అయినప్పటికీ టీడీపీ కాంట్రాక్టర్ల ఒత్తిళ్లతో అందినంత దోచుకునేందుకు రంగం సిద్ధమవుతోం ది. దీనికి అవినీతి ముద్ర లేకుండా, అనుకూలమైన ఒకరిద్దరు టీడీపీ కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ధి్ద కలిగేలా జీఓ జారీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఇందులో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.160కోట్ల ప్రభుత్వ నిధులు దోచి పెట్టేందుకు పక్కా ప్రణాళిక సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు తరలించే కుప్పం ఉపకాలువ పనులను 4శాతం అదనంతో రూ.430.27 కోట్లకు హెఈఎస్, ఆర్కే, కోయా జాయింట్ వెంచర్ పనులు దక్కించుకోగా ఈ సంస్థల వినతిమేరకు ప్రభుత్వం రిత్విక్ ప్రాజెక్ట్స్, మరో కాంట్రాక్టు సంస్థను పనుల్లో భాగస్వామ్యం కల్పించింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వం ముందుగా తెలిపిన పనుల అంచనా వ్యయాన్ని తెలిపింది. దీనిని పరిశీలించాకే కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కిం చుకొన్నాయి. నిబంధనల మేరకు ప్రతిపాదిత పనులు పూర్తి చేయాల్సిన సంస్థలు తమకు అనుకూలంగా పనులు చేశాయి. కాలువ దూరం తగ్గించడం, కొత్తగా పనులను చేర్చుకొంటూ వచ్చా యి. నిబంధనల మేరకు నిర్ణయించిన అంచనాకు పనులు పూర్తిచేసి ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాకర్లది. ఇక్కడ మాత్రం పనులు అనుకూలంగా చేసుకోవడంతో పాటు అదనపు భారం పడిందంటూ రూ.160కోట్లు చెల్లించాలని మెలిక పెట్టా రు. ఈ విషయాన్ని మదనపల్లె సర్కిల్ అధికారులు చీఫ్ ఇంజినీర్ల కమిటీకి నివేదించారు. అదనపు చెల్లింపులకు సంబం ధించిన వివరాలతో కమిటీ ఆర్థికశాఖకు నివేదిక పంపింది. ఆర్థికశాఖ ఈ నివేదికను మూడురోజుల క్రితం చీఫ్ ఇంజనీర్ల కమిటీకి తిప్పిపంపినట్టు సమాచారం. కుప్పం కోసమే? చీఫ్ ఇంజినీర్ల కమిటీ ప్రతిపాదనలో కుప్పం కాలువకు అదనంగా రూ.160 కోట్ల చెల్లింపుల ప్రస్తావన లేకుండానే 2014 తర్వాత పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా జీఓ 22,63 తరహాలో కొంత ప్రయోజనం కలిగించాలని మరో ప్రతిపాదనను మళ్లీ ఆర్థికశాఖకు పంపింది. ఈ శాఖ కాంట్రాక్టర్లకు అదనపు ధరలు ఎందుకు చెల్లించాలి, అందుకు కారణాలు, వివరాలను సమగ్రంగా నివేదిం చాలని చీఫ్ ఇంజనీర్ల కమిటికి నివేదిం చిందినట్టు తెలిసింది. దీనికి చీఫ్ ఇంజనీర్ల కమిటి నిర్ణయం, చెల్లింపులకు అనుకూలంగా ఎలాంటి ప్రతిపాదన అందిస్తుం దో తేలాలి. కుప్పం ఉపకాలువతోపాటు టీడీపీ ముఖ్యనేతలు చేపట్టిన పనులకు సంబంధించిన కొన్నింటికి మాత్రమే ఈ అదనపు నిధులు అందే విధంగా జీఓ జారీచేసే అవకాశాలు లేకపోలేదని భావి స్తున్నారు. కాంట్రాక్టర్లందరికీ వర్తించకుండా తమ కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులందించేలా నిబంధనలు సవరించి చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుప్పం కాలువ పనులు పూర్తిగా ఆగిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పనులు చేయించేందుకు భయపడుతున్నారు. టీడీపీ ముఖ్యనేత ఒకరు ఈ పనుల్లో భాగస్వామిగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. -
మహిళల పేరిటే పట్టాలు
►దళితులకు భూపంపిణీపై జీవో జారీ ►అత్యంత నిరుపేదలకు తొలి విడత భూమి ►మార్గదర్శకాలపై త్వరలో ఉత్తర్వులు! సాక్షి, హైదరాబాద్: భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ భూమికి మహిళల పేరిటే పట్టాలను ఇవ్వనుంది. అలాగే ఏడాదిపాటు సాగుకు అవసరమైన ప్యాకేజీని కూడా అందించనుంది. ఈ మేరకు శనివారం ఎస్సీ అభివృద్ధిశాఖ జీవో జారీ చేసింది. దళితులు గౌరవంగా బతికే అవకాశం కల్పించేందుకు.. భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భూమి కొనుగోలు, పంపిణీ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం.. వ్యవసాయాధారిత దళిత కుటుంబాల అభివృద్ధికి గతంలో ఉన్న విధానాల్లో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం 2014-15లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద దళిత నిరుపేదలకు భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తారు. ఇందులో అసలే భూమిలేని దళిత కుటుంబాలకు మొదటి విడతలో ప్రాధాన్యం ఇస్తారు. అర ఎకరం, ఎకరం భూమి ఉన్న పేద దళిత రైతులకు మిగతా భూమిని అందించి, మూడెకరాల రైతులుగా మార్చడాన్ని రెండో విడతలో చేపడతారు. మూడెకరాలు ఒకే చోట అందిస్తారు. ఇప్పటికే దళిత కుటుంబాలకు అసైన్ చేసిన భూములకు కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపచేస్తారు. రికార్డుల ఆధారంగా భూమిలేని దళితులెవరో..? జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. భూముల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వంటి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. భూమి అభివృద్ధికి, నర్సరీలకు, వ్యవసాయ పరికరాలకు సహాయాన్ని అందించడంతో పాటు ఒక పంట కాలానికి అవసరమైన నీటి వసతి, డ్రిప్ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పంపుసెట్లు, విద్యుదీకరణ తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది. వ్యవసాయ వ్యయానికి సంబంధించిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారు ఖాతాకే జమ చేస్తారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడిగా జారీ చేయనున్నారు.