GO No. 279
-
మంత్రి ఇంటిని ముట్టడించిన మున్సిపల్ కార్మికులు
-
మంత్రి కాలువ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీవో నెం 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముట్టడిని అడ్డుకున్న పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు మున్సిపల్ కార్మికులను అక్కడినుంచి ఈడ్చిపారేశారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మంగళగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా
279 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. విధులను బహిష్కరించి పురపాలక కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం నుంచి కాంట్రాక్ట్ కార్మికులు జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు.