ల్యాండ్ పూలింగ్ పై కొత్త జీవో
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ల్యాండ్ పూలింగ్ అంశానికి సంబంధించి మంగళవారం ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. రాజధాని భూసేకరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ పై పలు రకాల ఆరోపణలు రావడంతో తాజాగా జీవో నంబరు 75 ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ల్యాండ్ పూలింగ్ కు ఆఖరు తేదీ మే1, 2015 గా ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది.
అప్పటిలోపు భూములు ఇచ్చేవారికి మాత్రమే 10 ఏళ్ల పాటు ప్యాకేజీ ఉంటుందని స్పష్టం చేసింది. ఆ తరువాత భూములు ఇచ్చేవారికి ఎలాంటి ప్రయోజనాలు ఉండబోవని ఉత్తర్వుల్లో పేర్కొంది.