మేకపోతుకు పాలు!
కంకిపాడు: మేకపోతుకు పాలు.. ఇదేంటి విడ్డూరంగా అనుకుంటున్నారా?. అవునండీ ఇది నిజమే. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని జీవాల పెంపకందారుడు నక్కా రాంబాబు ఇటీవల మేకపోతును కొనుగోలు చేశాడు. మందలో కలిపే సమయంలో ఆ మేకపోతుకు వృషణాలను ఆనుకుని రొమ్ము ఉండటాన్ని గుర్తించా డు. దాన్ని పితికితే పాలు వచ్చాయి.
ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న జీవాల పెంపకందారులు, స్థానికులకు తెలపటంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాంబాబు ప్రతి రోజూ పాలు పితికి తాను పెంచుకుంటున్న కుక్కపిల్లకు పోస్తున్నాడు. నిజంగా వింతగా ఉంది కదూ. ఈ విషయమై కంకిపాడు పశువైద్యాధికారి డాక్టర్ కర్నాటి మాధవరావును సంప్రదించగా హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు.