goback
-
‘గో బ్యాక్ అమిత్ షా’
సాక్షి, చెన్నై : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు తమిళనాడులో ఊహించని షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు అమిత్ షా సోమవారం చెన్నైలో పర్యటించారు. ఒక్కరోజు పర్యటనకు వచ్చిన కమళ దళపతికి ‘గోబ్యాక్ అమిత్ షా’ అంటూ తమిళ ప్రజలు ట్విటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఇదే టాగ్‌తో స్వల్ప సమయంలో 75 వేల ట్వీట్లు షేర్ చేయడంతో ట్రెండింగ్‌గా మారింది. అమిత్ షా పర్యటనను నిరశిస్తూ తమిళనాడు ప్రముఖ పారిశ్రమికవేత్త సీకే కూమరవేల్ ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘తమిళ ప్రజలను దేశం పిచ్చివాళ్లగా, ఉగ్రవాదులు చూస్తోంది. ఇతరులను గౌరవించడం మాకు బాగా తెలుసు. మేము టుటీకోరిన్ ఉప్పును తింటాము. మీరు కూడా అది తినండి. ఇతరులను ఎలా గౌరవించాలో తెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు. మతపరంగా దేశాన్ని విడదీయాలని చూసే అమిత్ షా, నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులను ఇక్కడ చోటు లేదంటూ మరొకరు ట్వీట్ చేశారు. పిల్లలు, మహిళలు, దళితులకు హానీ చేసే వాళ్లను తమిళనాడు రానివ్వం అని ఓ యువకుడు ట్వీట్ చేశాడు. మాజీ సీఎం జయలలిత చనిపోయిన తరువాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన అమిత్ షా, నరేంద్ర మోదీలు చెన్నై రావడానికి వీళ్లేదని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత ఏప్రిల్‌లో తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన కావేరీ వాటర్ బోర్డును ఏర్పాటు చేయడంలో కేంద్రం విఫలమైందని తమిళనాడు ప్రజలు కేంద్రంపై తీవ్రంగా మండిపడుతున్నారు. TN seems to be the Waterloo. Let the people of the country think TN people are mad, outcaste even terrorists. But we have self-respect & eat with salt from Tuticorin. Try Tuticorin salt bro's, they are tasty & improves self esteem too. #GoBackAmithSha https://t.co/d2wWVAlUq6 — CK Kumaravel (@ckknaturals) July 9, 2018 -
హామీల బాబూ.. గోబ్యాక్
కర్నూలు(అర్బన్): ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు అనేక హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ అన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్న చంద్రబాబును విద్యార్థులు, నిరుద్యోగులు ‘గో బ్యాక్’ అంటు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లక్ష్మీనరసింహ మాట్లాడుతు విద్యార్థుల ఉపకార వేతనాలకు ఆధార్ లింకు తొలగిస్తానని.. ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండా, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితి కలిగిన వారికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. అయితే ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కళాశాల విద్యార్థికి ట్యాబ్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీతో పాటు ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత బస్ పాస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు భృతి విస్మరించారని.. పెరిగిన ధరలకు అనుగుణంగా సవరిస్తామన్న మెస్ చార్జీల ఊసే కరువైందన్నారు. ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 90 శాతం రాయితీ కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను మోసగించారన్నారు. యూనివర్సిటీల్లో వైస్ చాన్స్లర్లు, పాలకమండళ్లలో బీసీలకు 33.1/3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటకు కృషి చేస్తామని చెప్పిన బాబు ఇప్పుడు నోరు మెదపకపోవడం తగదన్నారు. త్వరలోనే చంద్రబాబు హామీలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. సమావేశంలో రాయలసీమ యూనివర్సిటీ నాయకులు మురళి, తిలక్, రాజు, రాజశేఖర్, తిమ్మయ్య, సుభాష్, నాగేంధ్ర, శంకర్ తదితరులు పాల్గొన్నారు.