దేవుడి సృష్టే
కాలిఫోర్నియా: ఈ ధరిత్రి దేవుడి సృష్టేనని నూటికి 40 మంది అమెరికన్లు విశ్వసిస్తున్నారు. గేలప్ తాజా పోల్ ప్రకారం ప్రతి పది మందిలో నలుగరు అమెరికన్లు ఈ భూమిని పది వేల సంవత్సరాల క్రితం దేవుడు సృష్టించారని నమ్ముతున్నారు.
ఇదిలా ఉండగా, ఆస్టరాయిడ్ అనే వేయి అడుగుల ఉల్క ఒకటి రేపు భూమికి దగ్గరగా రానుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దగ్గరగా అంటే ఎంత దూరం అనుకున్నారు? భూమికి 1.25 మిలియన్ కిలో మీటర్ల దూరం నుంచి వెళుతుంది. ఈ ఉల్క గంటకు 50వేల 400 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ ఆస్టరాయిడ్కు ఒక మహానగరాన్ని నాశనంచేసే శక్తి ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.