బాహు'బల్లి' దడేల్మని తలుపుకొడితే..
థాయిలాండ్: చిన్న పరిమాణంలో ఉన్న బల్లిని చూస్తేనే సాధరణంగా ఏదోలా అనిపిస్తుంది. అలాంటిది ఓ గాడ్జిల్లా పరిమాణంలో ఉన్న బల్లిని చూస్తే.. అది కూడా ఒక అతిథిలాగా వచ్చి ఇంటి తలుపుకొడితే.. ఊహించుకోగలరా.. సరిగ్గా థాయిలాండ్‌లో ఇదే జరిగింది. ఓ భారీ మొసలికన్నా పెద్ద ఆకారంలో ఉన్న ఓ బల్లి ఇంటి వద్దకు చేరింది. మెల్లగా పాకుతూ ఇంటి మెట్ల నుంచి గుమ్మం వరకు వెళ్లింది. అనంతరం గోడకు తనతోక సహాయంతో నిల్చొని డోర్ కొట్టింది. అలా ఒకసారి కాదు పలుమార్లు.
ఈలోగా ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ పెద్ద ఆకారాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ఫోన్లో ఆ భారీ బాహుబల్లిని ఫొటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టడం మొదలుపెట్టాడు. అలా ఓ రెండు గంటలపాటు ఫొటోలు పోస్ట్ చేసి తర్వాత ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో బల్లి కదులుతున్న ప్రతిసారి ఓ కుక్క అరుస్తున్న శబ్దం కూడా రికార్డయింది.
తర్వాత ఓ తాడుతో ఆ బల్లిని బందించేందుకు ప్రయత్నిస్తుండగా అది తన తోకతో ఆ డోర్‌ను ఈ డోర్ ను కొడుతూ చేసిన హంగామాకు వారు బెంబేలెత్తిపోయారు. అనంతరం దానిని బందించి అడవిలో విడిచిపెట్టారు. కాగా, అత్యంత అరుదైన ఈ అతిధి సాధారణంగా ఆ ప్రాంతానికి అప్పుడప్పుడు వస్తుండే అతిథి అని, దానిని సాలెనా అని పిలుచుకుంటారని, అడవిలో వదిలిరావడం తిరిగి అది ఇళ్లలోకి రావడం ఒక ఆనవాయితీలాగా తయారైందని చెబుతున్నారు.