ఏపీ రాజధాని నిర్మాణంలో మేమూ కలుస్తాం
సింగపూర్ ప్రభుత్వం ప్రతిపాదన
జీ టూ జీ విధానంలో నిర్మిద్దామని సూచన
న్యూఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం, అభివృద్ధిపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఏపీ రాజధానిని జీ టూ జీ (ప్రభుత్వం -ప్రభుత్వం) విధానంలో అభివృద్ధి చేయవచ్చ ని, ఇందులో తామూ భాగస్వాములవుతామని సూచించింది. ముగ్గురు మంత్రుల సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సుదీర్ఘంగా చ ర్చించింది. సింగపూర్ మంత్రులు గో చోక్ టాం గ్, ఎస్.ఈశ్వరన్, డెస్మాండ్ లీ ఈ బృందంలో ఉన్నారు. ఈ నగరాన్ని ప్రభుత్వాల భాగస్వామ్యంతో జీ టూ జీ విధానంలో అభివృద్ధి చేయాలని బృందం వెంకయ్యకు సూచించింది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు సింగపూర్ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుం దని ప్రతిపాదించింది. ఈ సూచనను పరిశీలిస్తామని, పట్టణాభివృద్ధి కార్యదర్శి శంకర్ అగర్వాల్ తదుపరి సంప్రదింపులు జరుపుతారని వెంకయ్య చెప్పారు. కేంద్రం చేపట్టిన వంద స్మార్ట్ సిటీల పథకం మౌలిక స్వరూపం, విధివిధానా లు, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం తదితర వివరాలను ఈ బృందం తెలుసుకుంది. పట్టణాభివృద్ధి రంగంలో ఇరు దేశాల పరస్పర సహకారానికి సంబంధించి పలు అంశాలపైన కూడా చర్చించారు. ఈ సందర్భంగా నగరాల్లో ప్రజలకు మెరుగైన సేవలు, నీటి శుద్ధి, సరఫరా, గ్యాస్ సరఫరా, రవాణా, ఇంధన నిర్వహణ, వైద్యం, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ జరిగింది.