జోస్ ఆలుక్కాస్ ‘ఎన్ఆర్ ఐ ఫెస్ట్’
హైదరాబాద్ : ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ‘ఎన్ఆర్ఐ ఫెస్ట్’ను నిర్వహిస్తోంది. దీనిలో వివిధ నూతన శ్రేణి వజ్రాభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫెస్ట్‌లో ఉంచిన ఆభరణాల ధరలు రూ.5000 నుంచి ప్రారంభమౌతాయని పేర్కొంది. ‘మేము నాణ్యతలో ఎటువంటి రాజీపడం. అత్యున్నత నాణ్యత కలిగిన మా కలెక్షన్లను ఎన్ఆర్ఐలు క చ్చితంగా ఇష్టపడతారు’ అని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా తెలిపారు.