అక్షయ తృతీయ..బంగారం కొనాలా? వద్దా?
ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా అక్షయమైన బంగారాన్ని కొనాలా? లేక దానం చేయాలా? అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శభప్రదం అనే నానుడి వ్యాపార ప్రయోజనాల కోసమే వచ్చిందా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి. ఈ సందేహాలను పక్కన పెడితే మార్కెట్ ఎనలిస్టుల మాత్రం బంగారం ధరలు ఇంకా దిగి వచ్చే సంకేతాలు అందిస్తున్నారు.
ధరలతో సంబంధంలేకుండా అక్షయ్ తృతీయా సమయంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని వెల్వెట్ కేస్.కామ్ సఋఈవో, సహ వ్యవస్థాపకుడు మంజు కొఠారియా వ్యాఖ్యానించారు. అలాగే మారుతున్న పరిస్థితుల్లో బంగారం కంటే డైమండ్ కొనుగోళ్లపై వినియోగదారులు ఎక్కువ దృష్టిపెడుతున్నట్టు తెలిపారు.
మరోవైపు ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే.. గోల్డ్ ఈక్విటీ బాండ్స్ , ప్రభుత్వం జారీ చేసే గోల్డ్‌బాండ్స్ కొనుగోలు పెట్టుబడులకు మంచి అవకాశమని విశ్లేషకులు సూచిస్తున్నారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో పుత్తడి నష్టాలనుంచి కోలుకొని లాభాల్లోకి మళ్లింది. పది గ్రా. రూ.37లు లాభపడి రూ. 28,806 వద్ద ఉంది.
ఇది ఇలా ఉంటే లాభాల స్వీకరణతో నష్టాల బాటలోపయనిస్తున్న మార్కెట్లలో జ్యుయల్లరీ స్టాక్స్ ఆకర్షణీంగా నిలిచాయి. అక్షయ తృతీయ సందర్భంగా సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, మార్కెట్లో జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క టైటన్ తప్ప, మిగతా షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 1.2 శాతం గీతాంజలి 1 శాతం, టీబీజెడ్ 0.7 శాతం , పీసీ జ్యువెలర్స్ 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.