సమష్టి కృషితోనే ‘బంగారు తెలంగాణ’
అచ్చంపేట టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుకన్న బంగారు తెలంగాణ సాధనకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా కృషి చేయూలని జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్ అన్నారు. సోమవారం స్థానిక మండల కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాలతో సమానంగా వెనకబడిన అచ్చంపేటను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే బాలరాజుకు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానన్నారు.
నియోజకవర్గ పరిధిలోని అధికారులు సర్పంచులకు సహ కరిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయూలన్నారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి పథకాలనై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వాచ్మెన్, స్వీపర్ల నియూమకానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యే బాలరాజు మాజీ మంత్రి మహేంద్రనాథ్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా జెడ్పీైచైర్మన్, ఎమ్మెల్యే బాలరాజులను స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సేవ్యానాయక్, తహశీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ జయ, ఎంఈఓ సరస్వతీభాయి, పీఏసీఎస్ ఛైర్మన్ నర్సింహ్మరెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమామహేశ్వరంలో జెడ్పీ చైర్మన్ పూజలు
అచ్చంపేట రూరల్ : ఉమామహేశ్వర క్షేత్రంలో జిల్లా పరిషత్ చెర్మైన్ బండారు భస్కర్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా పాపనాశిని గుండంలో స్నానం చేసి ఈశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ ఈఓ శ్రీనివాస్‌రావు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల నంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ఈఓ పలు దేవస్థానంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఆయన రంగాపూర్‌లోని హజ్రత్ నిజాంశావలి దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, నాయకులు మంజుల, మధుసూదన్‌రెడ్డి, ధర్మానాయక్, నరసింహ్మగౌడు, రాంబాబు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.