రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
కురవి/మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృత్యువాతకు గురికాగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కురవి మండలంలోని కాంపల్లి శివారు సత్యమాత ఆలయం సమీపంలో ఖమ్మం ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కారు పల్టీకొట్టి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీరోలు ఏఎస్సై సారమల్లు కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణం మార్నేనినగర్‌కు చెందిన మార్నేని వేణు, భార్య సునీత, కుమారులు మ నుచరణ్, శ్రీహర్షతో పాటు వేణు బంధువులైన సూరి శెట్టి శ్రీనివాసరావు, భార్య అనిత, కుమార్తె విదాత్రి మహబూబాబాద్ నుంచి విజయవాడకు గత సోమవారం వెళ్లారు. విదాత్రికి ఆరోగ్య సమస్యలుండడంతో విజయవాడలో చికిత్సకోసం కారులో వెళ్లారు. చికిత్స అనంతరం సోమవారం రాత్రి అదే కారులో విజయవాడ నుంచి ఖమ్మంకు చేరుకున్నారు.
ఖమ్మం నుంచి కురవి మీదుగా మహబూబాబాద్‌కు వస్తుండగా కురవి శివారులోని సత్యమాత గుడి సమీపంలోకి రాగానే సోమవారం తెల్లవారుజామున(మంగళవారం) కారు ఒక్కసారిగా పల్టీకొట్టింది. కారును శ్రీనివాసరావు డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు పల్టీకొట్టి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొంది. ఈ ఘటనలో మార్నేని మనుచరణ్(13) అక్కడికక్కడే మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న మార్నేని వేణుకు ఎడమకాలు విరిగి కిడ్నీల వద్ద బలమైన గాయమైం ది. వేణు భార్య సునీతకు, కుమారుడు శ్రీహర్షకు, వేణు సడ్డకుడైన సూరిశెట్టి శ్రీని వాసరావుకు, అతని భార్య అని తకు, కు మార్తె విధాత్రికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే శ్రీనివాసరావు 108కి సమాచారం అందజేయడంతో హుటాహుటిన క్షతగాత్రులను మహబూబాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మనుచరణ్ మృతదేహం వద్ద బంధువుల రోధనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సారమల్లు తెలిపారు.
గణపురంలో..
గణపురం(భూపాలపల్లి): గణపురం మండలంలోని బస్వరాజుపల్లె కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు సమీపంలో గొల్లపల్లె క్రాస్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. గణపురం ఏఎస్సై యాకుబ్‌అలీ కథనం ప్రకారం.. గణపురం మండలకేంద్రానికి చెందిన కొయ్యల కృష్ణంరాజు అనే వ్యక్తి స్థానిక ద్విచక్రవాహన షోరూంలో పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం కృష్ణంరాజు అతని ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి వెళ్లి రాత్రి 9గంటలకు తిరిగివస్తుండగా గొల్లపల్లె క్రాస్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా అతివేగంతో వచ్చి ఢీ కొట్టాడు. దీంతో అతను బండిపై నుంచి కింద పడగా తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన సింగరేణి ఉద్యోగులు వెంటనే 108కి సమాచారం అందించడంతో కృష్ణంరాజును సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ కూడా వైద్యులు పరిస్థితి విషమించిందని తెలపడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య మాధవి, రెండు సంవత్సరాల కూతురత్సుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.