పేషెంట్‌ను రేప్ చేసి పారిపోయాడు
గోండా: ఉత్తరప్రదేశ్ లో ఓ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు అక్కడ పని చేసే ఓ సిబ్బంది.
రాంచీకి చెందిన ఓ మహిళను రైల్వే పోలీసులు గోండా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ మధ్యే చేర్పించారు. ఆమె ఒంటరిగా ఉండటం గమనించిన స్టాఫ్ నర్స్ పుష్కర్ కుమార్ శుక్రవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
ఉదయం విధులకు వచ్చిన మరో మహిళా ఉద్యోగినితో ఘటన గురించి వివరించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు . బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం పంపించినట్లు ఎస్పీ ఉమేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుడు పుష్కర్ కోసం గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
పుష్కర్ కుమార్ ను ఈ మధ్యే ఔట్ సోర్సింగ్ ద్వారా స్టాఫ్ నర్స్‌గా నియమించుకున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.