విద్యుదాఘాతంతో రైతు మృతి
వేముల : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వైఎస్సార్ జిల్లా మండలంలోని గొందిపల్లె పంచాయతీ పరిధిలో రంగోరిపల్లె గ్రామంలో బుధవారం రాత్రి 6.30గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. తోట వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కళ్లమల్ల రామకృష్ణారెడ్డి(32) మృతిచెందారు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. రామకృష్ణారెడ్డి రాత్రి సమయంలో పంటలకు నీటి తడులు పెట్టేందుకు వెళ్లాడు. తోట వద్ద పైపులు సరిచేసుకుంటుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్వైర్లు తగిలి షాక్కు గురయ్యాడు. తోట వద్దకు వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు తోట వద్దకు వెళ్లి వెతికారు. అపస్మారక స్థితి పడి ఉన్న రామకృష్ణారెడ్డిని చూసి వెంటనే చికిత్స నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు.