‘హోదా’తోనే రాష్ట్రానికి మేలు
ఆగస్ట్ 2న జరిగే బంద్‌ను విజయవంతం చేయాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి
సత్తెనపల్లి: ప్రత్యేక హోదా సాధనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వైఎస్సార్‌ససీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్ట్ 2న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం పట్టణంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ చల్లంచర్ల సాంబశివరావు గహంలో వ్యాపార వర్గాలతో నిర్వహించిన సమావేశంలో రాంబాబు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. ఆదాయ పన్ను, అమ్మకం పన్నులు మినహయింపులు ఉంటాయన్నారు. తమిళనాడు, కర్ణాటకలలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారన్నారు. ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, లాభాలు మెండుగా ఉంటాయన్నారు. లాభం వస్తుందనుకుంటే ఏ పారిశ్రామిక వేత్త అయినా పరిశ్రమలు నెలకొల్పుతారన్నారు. తద్వారా ఉద్యోగావకాశాలు పెరిగి, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని, రాష్ట్రాభివద్థి జరుగుతుందన్నారు.అధికారంలోకి రాకముందు ప్రత్యేకహోదా కావాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా సంజీవని కాదని మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యేకహోదా సాధ్యం కాదంటుందన్నారు.
ప్రజలంతా సహకరించాలి..
కేంద్ర ప్రభుత్వం పై ప్రజా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తమ పై ఉందన్నారు. ప్రజలందరూ సహకరిస్తే తెలుగురాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. వ్యాపారులు అందరూ ఆగస్ట్ 2న జరిగే రాష్ట్ర బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌మహబూబ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగుర్‌మీరాన్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ చల్లంచర్ల సాంబశివరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్టా సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, పట్టణ, మండల యూత్ సెల్ అధ్యక్షుడు అచ్యుత్ శివ ప్రసాద్, కళ్ళం విజయభాస్కరరెడ్డి, బీసీ సెల్ జిల్లా నాయకులు దుగ్గి భద్రయ్య, వరికల్లు రామయ్య, ఎస్సీ సెల్ నాయకులు కోడిరెక్క దేవదాసు, మద్దు రత్నరాజు, పార్టీ నాయకులు ఆకుల హనుమంతురావు, గూడా శ్రీనివాసరెడ్డి, కొత్తా భాస్కర్, వ్యాపారులు పాల్గొన్నారు.