మాధవ్‌కు కన్నీటి వీడ్కోలు
పాన్‌గల్, న్యూస్‌లైన్: ఈనెల 23న ఒడిశాలో జరి గిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేత మాధ వ్ అలియాస్ గొల్ల రాములు అం త్యక్రియలు సోమవారం మండలంలోని గోప్లాపూర్‌లో అతని సొంత వ్యవసాయ పొలంలో జరిగాయి. అంతకుముందు ఇం టికి తీసుకొచ్చిన మాధవ్ మృతదేహాన్ని చూసి తల్లి గౌరమ్మ, తండ్రి పెంటయ్య, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. వీరి రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి. పేదలకో సం తమ బిడ్డ పోరాడటం ఎంతో గర్వంగా ఉందన్నారు. మాధవ్‌ను కడసారిగా చూసేందుకు చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులు, వివిధ ప్రజాసంఘాల నేతలు భారీగా తరలొచ్చారు.
కాంగ్రెస్‌పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి మాధవ్ మృతదేహానికి నివాళులర్పించా రు. అమరవీరుల బంధుమిత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధ వి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..ప్రజలపక్షాన పోరాటం చేస్తున్న మాధవ్ పోలీసుల కాల్పుల్లో మరణించలేదని, జనజీవన స్రవంతిలో కలవలనుకున్న ఆయనను ఈనెల 23న ఒడిశా పోలీసు లు పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని ఆరోపించారు. జన జీవన స్రవంతిలోకి రావాలని ప్రభుత్వం ఓ వైపు పిలుపునిస్తూ.. మ రోవైపు బూ టకపు ఎన్కౌంటర్లకు పాల్పడటం దా రుణమన్నారు. పోలీసులు రివార్డు కో సం మనిషిని దుర్మార్గంగా చంపడం దా రుణమన్నారు. పేద కుటుం బంలో జన్మించి మారుమూల గ్రామం నుంచి మంచి కళాకారుడుగా, ఓ రాష్ట్రనేతగా ఎ దగడం ఎంతో గర్వించదగిన విషయమన్నారు. అమరవీరుల బంధుమిత్ర సంఘం వారి కుటుంబానికి అండ గా ఉం టూ ఆయన ఆశయసాధన కోసం పోరాటం చేస్తామన్నారు.
మాటల్లో శాంతి..చేతల్లో హింస: రాఘవాచారి
ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తూ దమనకాండకు పాల్పడుతోందని పాలమూ రు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. మావోయిస్టు నేత మాధవ్‌కు అయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం బూ టకపు ఎన్కౌంటర్లు మానుకోవాలన్నారు. ప్రజలపక్షాన పోరాడుతున్న మాధవ్ వంటి నాయకులను పోలీసులు కాల్చిచంపడం దారుణమన్నారు. ప్రజలపక్షాన నిలబడ్డ మాధవ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.
పేదలపక్షాన పోరాడినందుకే..
పెత్తందారులు, భూస్వాములకు వ్యతిరేకంగా పేదలపక్షాన పోరాడినందుకే ఒడి శా ప్రభుత్వం మాధవ్‌ను పోలీసులచే హత్యచేయించిందని పౌరహక్కుల సం ఘం రాష్ట్ర నాయకులు నర్సన్న, రాజు నందం అన్నారు..పేదల కోసం పోరాటాలు చేస్తూ మంచినేతగా ఎదుగుతున్న సమయంలో పోలీసులు కాల్చిచంపారని ఆరోపించారు. మాధవ్ ఏనాడూ తన కుటుంబం గురించి ఆలోచించలేదన్నారు. బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఆయన ఒడియా, తెలు గు, హిందీ భాషల్లో పాడిన పలు పాట లకు సంబంధించిన సీడీలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు బుచ్చారెడ్డి, ప్రభాకర్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.