‘గౌతమీ పుత్ర శాతకర్ణి’పై పిటిషన్‌కు సవరణ
హైదరాబాద్:
సినీ హీరో బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి ట్యాక్స్ మినహాయింపుపై పాత పిటిషన్లో కొన్ని మార్పులు చేస్తూ పీవీ కృష్ణయ్య గురువారం మరో పిటిషన్ వేశారు. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా క్యాబినెట్ తీర్మానంతో వందశాతం పన్ను మినహాయింపు ఇవ్వటంపై ఆయన ఇటీవల పిటిషన్ వేసిన విషయం విదితమే.
ఇందుకు గాను హైకోర్టు నోటీసులు అందుకున్న ఏప్రీ ప్రభుత్వం సమాధానం ఇవ్వకముందే, ఆయన మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.