నగర పదవి ఖరారు:జిల్లా పదవిపై ప్రతిష్టంభన
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ కుమార్ పేరు దాదాపు ఖరారైంది. అయితే జిల్లా టీడీపీ అధ్యక్షుని ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. గవిరెడ్డి రామానాయుడు, ఆనంద్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక తలనొప్పిగా మారిన నేపధ్యంలో నేతలు అధిష్టానానికి వదిలివేశారు.
ఇదిలా ఉండగా, విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా బుడ్డా వెంకన్న ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల అర్జునుడు ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గౌతు శిరీష పేరును ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత అధిష్టానానికి సూచించారు.