మేమంతా జగన్ వెంటే...
బెంగళూరు, న్యూస్‌లైన్ :వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే తామంతా ఉంటామని ఆ పార్టీ స్థానిక ఐటీ విభాగం ప్రతిన బూనింది. ఆదివారం కుందనహళ్లిలో గేట్ సమీపంలోని గోవిందరెడ్డి కల్యాణమంటపంలో ఐటీ విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ... రెండు కళ్ల సిద్ధాంతంతో కోస్తా, రాయలసీమ ప్రజలకు చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని సోనియాగాంధీ చేయలేకపోయిందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
సైకం శ్రీనివాసులు రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, బెంగళూరు ఐటీ విభాగం కన్వీనర్ వీరభద్రరావు, శ్రీనివాసులు రెడ్డి, నవీన్, పీసీ రెడ్డి, ప్రతాపరెడ్డి, వైఎస్ఆర్ కర్ణాటక ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, భక్తవత్సలరెడ్డి పాల్గొన్నారు.