gowdons
-
YSR Kadapa: ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
-
తీగలాగితే డొంక కదిలింది
బెల్లంపల్లి: మొక్కజొన్నల మాటున అక్రమంగా రవాణా చేస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న ఘటన మరువకముందే బెల్లంపల్లి పోలీ సులు మరో గుట్టును రట్టు చేశారు. బుధవారం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి ఏకంగా ఓ గోదాంపై దాడిచేసి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న మెడిశెట్టి గోవింద్ అనే యువకుడు మొక్కజొన్నల మాటున హైదరాబాద్ నుంచి ఓ ఆటో ట్రాలీలో ఆసిఫాబాద్‌కు సోమవారం 800 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు (నాలుగు క్వింటాళ్లు) రవాణా చేస్తుండగా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై వినోద్‌కుమార్ ఆటోట్రాలీని ఆపి తనిఖీ చేయడంతో నకిలీ విత్తనాల గుట్టు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వెంటనే నిందితుడు గోవింద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా కొన్ని విషయాలు వెల్లడించడంతో ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజా దవ్ ఆదేశాల మేరకు సోమవారం టూటౌన్ ఎస్సై పోలీసు బృందంతో ఆంధ్రప్రాంతానికి వెళ్లింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లుపై బెల్లంపల్లి పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా, అక్కడ తయారు చేస్తున్న నకిలీ విత్తనాల ను చూసీ నిర్ఘాంతపోయారు. జిన్నింగ్ మిల్లు ను స్థావరంగా చేసుకుని పెద్ద ఎత్తున ఫ్యాకెట్లలో విత్తనాలు నింపి సీజ్ చేస్తుండగా నింది తులు అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. జిన్నింగ్ మిల్లు స్థావరంగా.. జిన్నింగు మిల్లును ప్రధాన స్థావరంగా చేసుకుని పెద్ద ఎత్తున నకిలీ బీజీ–3 పత్తి విత్తనాలను తయారు చేస్తుండటాన్ని బెల్లంపల్లి పోలీసుల బృందం కనిపెట్టింది. వెంటనే దాడి చేసి తయారీదారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిన్నింగ్ మిల్లులో బస్తాల కొద్ది విత్తనాలను సిద్ధం చేసుకుని ప్యాకెట్లలో నింపడానికి సిద్ధంగా ఉంచిన, ప్యాకెట్లలో నింపుతున్న నకిలీ బీజీ–3 పత్తి విత్తనాలు 142 బస్తాలను (10 టన్నులు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన వెంటనే అక్కడి ఏడీఏ రవికుమార్‌కు టూటౌన్ ఎస్సై వినోద్‌కుమార్ సమాచారం అందించి ఘటనాస్థలికి రప్పించారు. వెంటనే ఆ విత్తనాలను సీజ్ చేయించారు. ప్రధాన సూత్రధారి మల్లికార్జున్‌రావు? నకిలీ పత్తి విత్తనాలను ఆ ప్రాంతానికి చెందిన దొండపాటి మల్లికార్జునరావు అనే వ్యక్తి తయారు చేయిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. వెంటనే అతడిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లికార్జునరావు రహస్యంగా నకిలీ విత్తనాలను తయారు చేయించి, ఆ విత్తనాలను ప్యాకెట్లలో పొందుపర్చి బోల్‌గార్డ్ (బీజీ)–3 పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. నడికుడిలో తయారు చేసిన నకిలీ విత్తనాలను మల్లికార్జున్‌రావు ఎంతో నేర్పుగా ప్యాకెట్ల రూపంలో కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సరఫరా చేయడం గమనార్హం. కొందరు స్థానికులు, ఆంధ్ర వలసవాదులు, ఈ ప్రాంత రైతులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూడటంతోపాటు దందాలో భాగస్వాములెవరనేది బయటపడే అవకాశం ఉంది. -
ముంబైలో అగ్నిప్రమాదం... ఒకరి మృతి
-
సర్వ నిర్లక్ష్యం !
– ఎస్ఎస్ఏ కార్యాలయం దాటని ‘సవరణాత్మక బోధన’ – గోడౌన్లోనే మూలుగుతున్న పుస్తకాలు – పట్టించుకోని అధికారులు అనంతపురం ఎడ్యుకేషన్ : చదవడంలో వెనుకబడితే చదువులో వెనుకబడినట్టే. తరగతి స్థాయికి తగిన సామర్థ్యం సాధించాలంటే మాతృభాషలో కనీస అభ్యసన స్థాయి ఉండాలి. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఈ నిజాలు వెలుగు చూశాయి. పిల్లలు తరగతులు మారుతున్నారు తప్ప.. చాలా మందికి కనీసం చదవడం, రాయడం కూడా రావడం లేదు. ఇక గణితంలో మరీ అధ్వానంగా ఉన్నారని సర్వే గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులు కనీస అభ్యసన స్థాయిలకు చేరుకునేవిధంగా ‘సరవణాత్మక బోధన’ (రెమిడియల్ టీచింగ్) అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. 1–5 తరగతుల్లో ‘సీ’ గ్రేడు విద్యార్థులు, 6–9 తరగతుల్లో డీ–1, డీ–2 గ్రేడుల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో వంద రోజుల పాటు ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో కరదీపికలు ముద్రించి అన్ని జిల్లాకు పంపిణీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అమలులో అధికారులు చేతులెత్తేశారు. ఎస్ఎస్ఏ కార్యాలయం దాటని కరదీపికలు 1–5 తరగతులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులపై కరదీపికలు వచ్చాయి. అలాగే 6–9 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులపై కరదీపికలు వచ్చాయి. ఇప్పటికీ 20 రోజులు పైబడుతున్నా కరదీపికలు ఎస్ఎస్ఏ కార్యాలయం గడప దాటడం లేదు. వచ్చినవన్నీ గోడౌన్లో భద్రపరిచి అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రారంభం ఎప్పుడో ? ఈ కార్యక్రమాన్ని పాఠశాలు పునఃప్రారంభం రోజు నుంచే అమలు చేయాల్సి ఉంది. అంటే షెడ్యూలు ప్రకారం ఇప్పటికి 31 రోజులు గడిచి ఉండాలి. కానీ ఇప్పటిదాకా కనీసం కరదీపికలు స్కూళ్లకు చేరలేదు. విద్యార్థుల ఎంపిక గందరగోళమే ప్రాథమిక స్థాయిలో సీ గ్రేడు, ఉన్నత స్థాయిలో డీ–1, డీ–2 గ్రేడు విద్యార్థులను ఎంపిక చేయడం అధికారులకు గందరగోళంగా మారింది. వాస్తవానికి ఆయా స్కూళ్ల వారిగా విద్యార్థుల గ్రేడింగ్‌ను ఆన్లైన్లో పొందుపరిచారు. వాటి ఆధారంగా పిల్లల సంఖ్యను తీసుకుంటే వచ్చిన కరదీపికలు చాలవని భావిస్తున్న అధికారులు ఇష్టానుసారంగా ఎంపిక చేసినట్లు తెలిసింది. ఒక స్కూల్లో ఒక్కో సబ్జెక్టులో ఒక్కో విధంగా గ్రేడింగ్ వచ్చి ఉంటుంది. కానీ అధికారులు మాత్రం సగటున గ్రేడింగ్ తీసుకుంటున్నట్లు తెలిసింది. నేడు ఎస్పీడీ బృందం రాక ఎస్ఎస్ఏలో ఇటీవల వెలుగుచూసిన అక్రమాలపై మరోసారి విచారించేందుకు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్పీడీ) బృందం రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా గురువారం ఎస్ఎస్ఏ కార్యాలయానికి రానున్నారు. వివిధ పథకాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్న ఎస్పీడీ బృందం ‘సవరణాత్మక బోధన’ నిర్లక్ష్యంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.