గ్రామాల్లో బోనాల వైభోగం
కందుకూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గుమ్మడవెల్లి, కొత్తగూడ, పులిమామిడి, దాసర్లపల్లి, సాయిరెడ్డిగూడ, మీర్ఖాన్పేట, మాలగూడ, రాచులూరు, చీమలవానికుంట, గూడూరు, అగర్మియాగూడ, బేగంపేట, అన్నోజిగూడ, తిమ్మాయిపల్లి, ఊట్లపల్లి తదితర గ్రామాల్లో పోచమ్మ, మార్కమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, కాటమయ్య బోనాలు వైభవంగా జరిగాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ మహిళలు, చిన్నారులు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.