ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వే డుకలు ప్రారంభం
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్ : ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవిదేశాలకు చెందిన వేలాది మంది సత్యసాయి భక్తులు వేడుకలలో పాల్గొన్నారు. సాయికుల్వంత్ సభామందిరంలోని సత్యసాయి మహా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఇంటర్నేషనల్ క్రిస్మస్ కమిటీ కో ఆర్డినేటర్ జాన్‌బెన్నర్ క్యాండిల్ వెలిగించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ, క్రిస్మస్ విశిష్టతను వివరిస్తూ ఆలపించారు. గంట పాటు క్రిస్మస్ క్యారోల్స్‌తో ప్రశాంతి నిలయం మార్మోగింది. బుధవారం సాయికుల్వంత్ సభా మందిరంలో విదేశీ భక్తులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.