'ముద్దు'ల నర్స్ ఇకలేరు!
రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో జపాన్ సేనలు అమెరికాకు లొంగిపోయాయన్న వార్తతో యుద్ధం ముగిసి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ శుభవార్తను అందరితో పంచుకునేందుకు చాలా మంది చిన్నాపెద్దా, ఆడా మగా అనే వ్యత్యాసం లేకుండా నగర వీదులలోకి వచ్చారు. సరిగ్గా ఆ సమయంలో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ దృశ్యం చోటుచేసుకుంది. 1945, ఆగస్టు 14న ఓ జంట (నర్స్ గ్రెటా ఫ్రైడ్మన్-నావికుడు జార్జ్ మెండాన్సా)అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకుంది.
అప్పట్లో ఈ ఫొటో అప్పట్లో సంచలనమని చెప్పవచ్చు. ఆ ఫొటోలో కనిపిస్తున్న నర్స్ గ్రెటా జిమ్మర్ ఫ్రైడ్మన్(92) ఇటీవల మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె కుమారుడు జోషువా ఫ్రైడ్మన్ అధికారికంగా వెల్లడించారు. ఇంతకీ విషమం ఏంటంటే.. ఆ ఫొటోలు ముద్దుపెట్టుకున్నవాళ్లు ప్రేమికులు కాదు. కనీసం ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు కూడా. నావికుడు మెండాన్సా నిజానికి అక్కడే పనిచేసే నర్స్ రిటా పెట్రీని లవ్ చేసి.. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆ ఫొటోలో రిటా కూడా ఉంది.
యుద్ధం ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఫొటో అప్పటి మ్యాగజైన్లో ఫుల్పేజీలో ప్రచురించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత 1980లో ఈ ఫొటోలో ఉన్నది గ్రెటా ఫ్రైడ్మన్, జార్జ్ మెండాన్సాగా గుర్తించారు. గత గురువారం వర్జీనియా, రిచ్ మండ్ లోని ఆస్పత్రిలో ఫ్రైడ్మన్ కన్నుమూసిన సందర్భంగా మరోసారి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానిక మీడియాలో మరోసారి నర్స్ గ్రెటా ఫ్రైడ్మన్-నావికుడు జార్జ్ మెండాన్సా పేర్లు మార్మోగిపోయాయి.