శ్రీసిటీని సందర్శించినచైనా మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుల బృందం
శ్రీసిటీ(సత్యవేడు): చైనాలోని మొబైల్ పరిశ్రమకు చెందిన 40 మంది ఉన్నత శ్రేణి ప్రతినిధుల బృందం సోమవారం ఏపీలోని శ్రీసిటీని సందర్శించింది. ఈనెల నెల 22, 24 తేదీలలో డిల్లీలో జరిగిన ఇండియా-చైనా మొబైల్ ఉత్పత్తి దారుల వస్తుప్రదర్శనలో పాల్గొన్న ప్రతినిధుల బృం దంలో కొందరు తమ పర్యటనలో భాగంగా శ్రీసిటీకి విచ్చేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డెరైక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వీరికి స్వాగతం పలికారు. శ్రీసిటీ మౌలిక వసతులను, పారిశ్రామిక ప్రగతిని ఆయన వారికి వివరించారు.
ప్రపంచంలో మొబైల్ ఫోన్ల వినియోగంలో భారత్ ముందుండగా, వాటి ఉత్పత్తిలో చైనా అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు తయారు చేసే ఫ్యాక్స్‌కాన్ సంస్థ శ్రీసిటీలో ఉండడం, తిరుపతి, చెన్నైలో మొబైల్ హబ్ ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతం మొబైల్ ఫోన్ల తయారీ వ్యాపారానికి అనుకూలంగా ఉందని ఆయన వివరించారు.