త్వరలో రైలు చార్జీల పెంపు!
జూలై రెండోవారంలో బడ్జెట్
న్యూఢిల్లీ: త్వరలో రైలు చార్జీలు పెరిగే సూచనలు కన్పిస్తున్నారుు. 2014-15 రైల్వే బడ్జెట్‌ను మంత్రి సదానందగౌడ వచ్చే నెల రెండోవారంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రయూణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలు పెంచే ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ‘రైల్వేల ఆర్ధిక పరిస్థితి అంత బాగా ఏమీ లేనందున చార్జీల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అరుుతే ఎంత మేరకు పెంచాలో ఇంకా ఖరారు కాలేదు..’ అని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. రైల్వే బడ్జెట్ సందర్భంగానే ఈ పెంపు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ఉండదని చెప్పలేమని, అరుుతే బడ్జెట్ సందర్భంగానే చార్జీల పెంపును ప్రకటించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
బడ్జెట్‌కు ముందు లేదా తర్వాతైనా సరే పెంచవచ్చునని అన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో మధ్యంతర రైల్వే బడ్జెట్ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం ప్రయూణికుల చార్జీల పెంపు జోలికెళ్లలేదు. అరుుతే గత మే 16వ తేదీన రైల్వే శాఖ ప్రయూణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీల్లో 14.2%, 6.5% చొప్పున పెంపుదలను ప్రకటించినా.. ఆ మరుసటి రోజే నిర్ణయూన్ని కొత్తగా వచ్చే రైల్వే మంత్రికే వదిలేస్తూ సదరు నోటిఫికేషన్‌ను నిలిపివేసింది.