Guangzhou city
-
ఈలాన్‌మస్క్ ఎక్కడ.. చైనా అప్పుడే మొదలెట్టింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిటికలెస్తూ ట్విటర్‌ను క్షణాల్లో కొనేసిన ఈలాన్ మస్క్‌కి ఇప్పటికీ ఓ కోరిక అలాగే ఉండిపోయింది. టెస్లా కార్లలో ఆటోపైలెట్కి అనుమతి సాధించేందుకు ఏళ్ల తరబడి ఈలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశించిన ఫలితం పొందలేదు. మరోవైపు చైనా చాప కింద నీరులా ఈ పని చేసేసింది. చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు ప్రపంచంలో తొలిసారిగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలోని నన్షా ప్రాంతంలో 100 రోబోట్యాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్ చేస్తున్న పోనీ.ఏఐ అనే కంపెనీ ఈ మేరకు లైసెన్స్ దక్కించుకుంది. అలాగే బీజింగ్ నగరంలోనూ సేవలు ఆఫర్ చేసేందుకు పోనీ.ఏఐతోపాటు ఇంటర్నెట్ దిగ్గజం బైడూ లైసెన్స్ పొందింది. 2021 నవంబరు.. బీజింగ్‌లో 67 అటానమస్ (డ్రైవర్ రహిత) వెహికిల్స్ పరీక్షల కోసం పోనీ.ఏఐ 2021 నవంబర్‌లో ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 7,00,000 ట్రిప్స్ పూర్తి చేసింది. 80 శాతం రైడర్స్ పాత కస్టమర్లేనని కంపెనీ తెలిపింది. క్వాంజో నగరంలోని ఇతర ప్రాంతాలతోపాటు చైనాలో ప్రథమ శ్రేణి నగరాల్లోనూ రోబోట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది నుంచి మొదలు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ అటానమస్ వాహనంలో డ్రైవర్ కూడా ఉంటారు. ఈ రెండు కంపెనీలూ రానున్న రోజుల్లో డ్రైవర్ లేకుండానే సేవలు అందించనున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన పోనీ.ఏఐ కంపెనీని జేమ్స్ హంగ్, టించెంగ్ లూహ్ 2016లో స్థాపించారు. చదవండి: ‘దిగంతర’ స్పేస్ స్టార్టప్'.. ఇంజనీరింగ్ విద్యార్థుల సక్సెస్ స్టోరీ -
చైనాలో దడపుట్టిస్తున్న కొత్తరకం స్రెయిన్
బీజింగ్: కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలోని గాంజావ్ సిటీలో కొత్త రకం స్ట్రెయిన్ దడపుట్టిస్తుంది. మునుపటి స్ట్రెయిన్లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్ సిటీలో గత వారం రోజుల్లో 20 మందిలో ఈ కేసులు బయటపడ్డట్లు తెలుస్తోంది. తాజాగా బయటపడిన కేసుల్లో వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో రాసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గాంజావ్ ప్రాంతంలో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. తమ దేశంలో కరోనాను కట్టడి చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమయంలో మళ్లీ పదుల సంఖ్యలో కరోనా కేసులు విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. కరోనా కొత్త వేరియంట్ బయటపడడంతో దీని వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త వేరియంట్ అన్వేషణలో భాగంగా లివాన్ జిల్లాలోని 5 ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది. చదవండి: మరోముప్పు.. కరోనా హైబ్రిడ్ -
చైనాలో అతి పెద్ద స్టేడియం
గ్వాంగ్జూ: ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. ‘ఫ్లవర్ సిటీ’గా పేరున్న గ్వాంగ్జూ నగరంలో కమలం ఆకారంలో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. చైనా జాతీయ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్ అయిన ‘గ్వాంగ్జూ ఎవర్‌గ్రాండ్’ టీమ్ యాజమాన్యం దీని రూపకర్త. ఈ జట్టు 2022లోగా దీనిని పూర్తి చేసి తమ హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగించుకోనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్దదైన బార్సిలోనా ఎఫ్‌సీ ‘క్యాంప్ నూ’ స్టేడియంకు మించి దాదాపు లక్షకు పైగా సామర్థ్యంతో కొత్త స్టేడియం నిర్మితమవుతోంది. గురువారం దీని పనులు ప్రారంభం కాగా మొత్తం బడ్జెట్ 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు). -
వెరైటీగా ప్రపోజ్ చేశాడు!
బీజింగ్: ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా తెలిపాడో ప్రేమికుడు. వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడో చైనా లవర్. డైమండ్ రింగ్ బదులుగా డైపర్స్ తో తన ప్రేమను వ్యక్తం చేశాడు. 50పైగా డైపర్ ప్యాక్స్ తో ప్రపోజ్ చేశాడని స్థానిక మీడియా వెల్లడించింది. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన ఫెంగ్ రెండేళ్ల పాటు తన ప్రియురాలితో ప్రేమాయణం సాగించాడు. ఆమె నెల తప్పిందని తెలుసుకుని తన ప్రేమను వెరైటీగా తెలపాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. తన స్నేహితుల సహాయంతో 4500 డైపర్లు కొని వీటిని 50 బ్యాగుల్లో పెట్టి హృదయాకారంలో ప్యాక్ చేశాడు. పెర్ల్ నది ఒడ్డున తన ప్రియురాలికి దీన్ని బహూకరించి ప్రేమను వ్యక్తం చేశాడు. అంతేకాదు మరో సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు. డ్రోన్ సహాయంతో మరో డైపర్ బ్యాగ్ ను ఆమెకు అందించాడు. ఇది ఓపెన్ చేయగానే ఫెంగ్ ప్రియురాలి ముఖం సంభ్రమాశ్చర్యాలతో వెలిగిపోయింది. డైపర్ బ్యాగ్ లోపల డైమండ్ రింగ్ పెట్టి ఆమెను ఆశ్చర్యపరిచాడు. 'ఈరోజు నుంచి నిన్ను, మనకు పుట్టబోయే బిడ్డను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. నన్ను పెళ్లి చేసుకోమని కోరుతున్నా' అని ప్రపోజ్ చేయగా ఆమె వెంటనే అంగీకరించింది.