Gudur police
-
జీఎస్టీ పేరుతో విడతల వారీగా రూ.5.90 లక్షలు కాజేశారు
గూడూరు: పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నారని ఆశపెట్టి గిరిజన దంపతులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. రెక్కలుముక్కలు చేసుకొని ఇంటి కోసమని కూడబెట్టుకున్న సొమ్మును దోచేశారు. రూ.12.80 లక్షలు గెల్చుకున్నారని మభ్యపెట్టి.. రూ.5.90 లక్షలు కాజేశారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. గూడూరు మండలం పురిటిపాళెంకు చెందిన కమ్మంపాటి మహేష్, లక్ష్మీదేవి.. కొలనుకుదురులో రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు చెంచయ్య వరి కోత మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబమంతా కలిసి ఇల్లు నిర్మించుకునేందుకని రూ.2.50 లక్షలు పొదుపు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది వినాయక చవితికి ముందు లక్ష్మీదేవికి ఓ ఉత్తరం వచ్చింది. అందులో రూ.12.80 లక్షలు గెల్చుకున్నట్లు ఉంది. ఆ కార్డులో ఉన్న నంబర్‌కు మహేష్, లక్ష్మీదేవి ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కంపెనీ ద్వారా కూపన్లు తీస్తామని.. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మీకు రూ.12.80 లక్షలు వచ్చాయని చెíప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ అదే నంబర్‌కు ఫోన్ చేయగా.. ఆ మొత్తం మీ అకౌంట్లో జమ చేయాలంటే ఆధార్, పాన్‌కార్డు నంబర్లతో పాటు అకౌంట్ వివరాలు వాట్సాప్ చేయాలని సూచించాడు. అనంతరం ఆదాయ పన్ను కింద రూ.20 వేలు తమ అకౌంట్లో వేయాలని చెప్పాడు. దీనిపై మహేష్, లక్ష్మీ ప్రశ్నించగా.. ఆదాయ పన్ను చెల్లించకపోతే అధికారులు, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని నమ్మబలికాడు. దాంతో వారిద్దరూ ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్లో డబ్బులు వేశారు. ఈసారి జీఎస్టీ, ఇతర ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పాడు. మా వద్ద డబ్బులేదని ఆ గిరిజన దంపతులు మొత్తుకున్నా.. వినకుండా ఫోన్ పెట్టేశాడు. దీంతో వారు చేసేదిలేక తమ వద్ద ఉన్న రూ.2.50 లక్షలతో పాటు అప్పు చేసి మరో రూ.3.40 లక్షలు ఇచ్చారు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోసగాళ్లు 7585049583, 9831371553 ఈ నంబర్ల నుంచి ఫోన్ చేశారని గిరిజన దంపతులు తెలపగా.. ఇవి కోల్‌కతాకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం
ఇటీవలే తండ్రి ఆత్మహత్య జఫర్‌గఢ్/గూడూరు: నెల క్రితం అదృశ్యమైన గిరిజన ఆశ్రమపాఠశాల విద్యార్థిని వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలం గర్మిళ్లపల్లిలో ప్రియుడితో కలసి పోలీసులకు పట్టుబడింది. గూడూరు సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై సతీష్ ఆదివారం విలేకరులకు వివరించారు. గూడూరు మండలం గుండెంగ శివారు చర్లతండాకు చెందిన బోడ రవి, విమల దంపతుల కూతురు కవిత (17) గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రవి, విమల హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటుండగా, కవిత గత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటోంది. కాగా, జఫర్‌గఢ్ మండలం గర్మిళ్లపల్లికి చెందిన గబ్బెట చంద్రయ్య (30) గూడూరు ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కవితతో చంద్రయ్యకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో కుటుంబపరువు తీయవద్దని కవితను రవి మందలించాడు. మనస్తాపానికి గురైన కవిత డిసెంబర్ 3న బయటికి వెళ్లిపోయింది. అతను నెక్కొండకు కవి తను రాత్రి గర్మిళ్లపల్లికి తీసుకెళ్లాడు. చంద్రయ్యకు ఇదివరకే వివాహమైంది. మూడేళ్ల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుంది. జనవరి 11న పోలీసులకు ఫిర్యాదు.. కూతురు వెళ్లిన విషయం సోదరులు రవికి చెప్పినా అతడు పట్టించుకోలేదు. దుర్గమ్మ పండుగకు రవి దంపతులు తండాకు వచ్చారు. బంధువులు, తండావాసుల రవిపై ఒత్తిడి తేవడంతో తన కూతురు కనిపించడం లేదంటూ జనవరి 11న గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాతి పరిణామాలతో మానసిక క్షోభకు గురైన రవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వాల్‌పోస్టర్ల ద్వారా విషయం వెలుగులోకి కవిత కనిపించడం లేదంటూ శనివారం ఆమె ఫొటోతో కూడిన వాల్‌పోస్టర్లు మహబూబాబాద్‌లో అంటించారు. కవిత ఫొటో చూసిన ఓ వ్యక్తి చంద్రయ్యకు ఫోన్ చేసి అడగడంతో ఆమె తన వద్దనే ఉందని, పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్సై సతీష్ సిబ్బందితో కలసి గర్మిళ్లపల్లి వెళ్లి కవితను, చంద్రయ్యను అదుపులోకి తీసుకున్నారు. కవిత మైనర్ కావడంతో మానుకోట మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, జడ్జి ఆదేశానుసారం బాలికను తల్లికి లేదా చిల్డ్రన్స్ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. చంద్రయ్యపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
విద్యార్థి కవిత ఆచూకీ లభ్యం