గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీకి పచ్చజెండా
హైదరాబాద్: గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీ డైలీ, కాజీపేట్-ముంబయి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేమంత్రి సురేశ్ ప్రభు సోమవారం ప్రారంభించారు. ఆయన సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీడియో లింక్ ద్వారా పచ్చజెండా ఊపి రెండు రైళ్లను ఆరంభించారు. అలాగే వీటితోపాటు సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలో ఏసీ రిటైరింగ్ రూం, డార్మిటరీ, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందశాతం ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రైల్వే జీఎం రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.