Gums
-
భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడుతున్నారా?
కొందరికి పళ్ల సందుల్లోనూ, చిగుర్ల మధ్య సందులు కాస్త ఎక్కువగా ఉంటాయి. భోజనం చేసిన ప్రతిసారీ ఆహారపదార్థాలు ఇరుక్కుంటుంటాయి. ఏదో నాన్‌వెజ్ తిన్నప్పుడో లేదా పీచుపదార్థాల్లాంటివి ఇరుక్కున్నప్పుడో ఎప్పుడో ఓసారి టూత్‌పిక్ వాడాల్సి వస్తే పట్టించుకోనక్కర్లేదుగానీ... ఇలా ప్రతిసారీ చేయాల్సివస్తే... జింజివైటిస్ అనే సమస్యకు అవకాశాలెక్కువ. దంతాలు ఇమిడి ఉండే చిగుర్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షనే జింజివైటిస్. ఈ సమస్య తీవ్రమైతే చిగుర్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకూ వ్యాపిస్తుంది. ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుర్ల వ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ వ్యాధి అడ్వాన్స్డ్ దశలోకి వెళ్తే ఫ్లాప్ సర్జరీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో ఎముక చుట్టూ ఉండిన చెడిపోయిన కణజాలాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. దీన్ని లేజర్ ద్వాదా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స సాధ్యమవుతుంది. లేజర్ చికిత్సలో సంప్రదాయ చికిత్స కంటే వేగంగా కోలుకుంటారు. భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడాల్సి వస్తే... ఒకసారి చిగుర్ల సమస్య ఏదైనా వచ్చిందేమో పరీక్షింపజేసుకోవాలి. చదవండి: ‘తిట్టే నోరే కాదు, అతిగా తినే నోరు కూడా ప్రమాదకరమే’ -
చిగుళ్ళ ఆరోగ్యానికి...
హెల్త్‌టిప్స్ కమల, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి లాంటి పుల్లని పండ్లు తింటే చిగుళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి. సోడాలో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. తేనెటీగ కాని తేలు కాని కుట్టినప్పుడు పొగాకులో రెండు చుక్కల నీళ్లు వేసి కచ్చాపచ్చాగా నలగ్గొట్టి గాయం మీద కడితే నొప్పి తగ్గుతుంది ఇది హాస్పిటల్‌కు వెళ్లేలోపుగా చేయాల్సిన ప్రథమ చికిత్స మాత్రమే.అజీర్తితో బాధపడుతుంటే తులసి ఆకుల పొడి లేదా పది ఆకులు, కొద్దిగా తాజా అల్లం, శొంఠిపొడి అర టీ స్పూన్, మిరియాలు ఐదు గింజలు తీసుకుని ఒక కప్పు నీటిలో మరిగించి తాగాలి.