ఆఖరి రోజు ఐదు పతకాలు
దుబాయ్: ఫజా అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి మీట్ ఆఖరి రోజు భారత అథ్లెట్లు ఐదు పతకాలతో మెరిశారు. రెండు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్య పతకం సాధించి సత్తా చాటారు. జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రోలో రెండు స్వర్ణాలు సాధించిన గుర్జార్ సుందర్ సింగ్ మూడో స్వర్ణాన్ని అందుకున్నాడు. టి–44/46 విభాగంలో షాట్‌పుట్‌ను 13.36 మీటర్ల దూరం విసిరి గుర్జార్ స్వర్ణం సాధించాడు.
హైజంప్ ఎఫ్–13/20/42/44 విభాగంలో శరత్ కుమార్ 1.66 మీటర్లు, గిరీశ నాగరాజ్ గౌడ 1.63 మీటర్లు ఎత్తుకు ఎగిరి రజత, కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో కూడా భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. వీల్‌ఛైర్ ఎఫ్–55 షాట్‌పుట్ విభాగంలో కరంజ్యోతి (5.76 మీటర్లు) స్వర్ణం సాధించగా... శతాబ్ది అవస్థి (5.71 మీటర్లు) రజతాన్ని కైవసం చేసుకుంది.