శిష్యవాత్సల్యం
సద్గురువులు తమను ఆశ్రయించిన శిష్యులకు తమ శక్తియుక్తులను, తమలో దాగియున్న సర్వవిద్యా రహ స్యాలను ఉపదేశిస్తారు. శుక మహర్షి పరీక్షిన్మహా రాజుకు భాగవతాన్ని ఉపదేశించే సందర్భంలో ‘‘ప్రియ తములైన శిష్యులకు సదాచార్యులు ఎంతో గొప్ప విద్యా రహస్యాలను ప్రేమతో ఉపదేశిస్తారు’’ అని పేర్కొన్నారు.
వేద శాస్త్ర పురాణేతిహాస సంప్రదాయ విజ్ఞాన రహస్యాలను శిష్యులకు అందించడమే లక్ష్యంగా జీవనాన్ని కొనసాగించేవారే సద్గురువులు. ఒకటో రెం డో ప్రశ్నలను అడిగి ఏవో కొన్ని విషయాలను మాత్రమే తెలుసుకుందామని భావించే వారిని కూడా సద్గురు వులు ఎక్కువ మక్కువతో అక్కు న చేర్చుకొని వారిని జిజ్ఞాసువు లుగా తీర్చిదిద్దుతారు. తల్లి కొసిరి కొసిరి పిల్లవాడికి తినిపిం చినట్లు సదాచార్యులు శిష్యుల నుద్దేశించి మరికొంచెం వినం డి, పరమరహస్యాలను వివరి స్తాను. మీకంటే ఆప్తులు, ఆత్మీయులు నాకు వేరెవరూ లేరు అంటూ విద్యాబుద్ధులను నేర్పిస్తారు.
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో నీవు నాకు ప్రియమైన మిత్రుడవు. కావున నీకు ఉత్తమోత్తమము లైన రహస్యార్థాలను వివరిస్తాను. ఇంతకు మించిన విలువైన మాట మరొకటి లేదు అని తనకు ప్రధాన శిష్యుడైన అర్జునుడికి అమిత వాత్సల్యంతో వరుసపెట్టి వివరించాడు. పాలు పిండేవారు అందుబాటులో లేకుంటే ఆవులు, గేదెలు తమ దూడలను తలుచుకుం టూ తమ పొదుగు దగ్గర దూడలు మూతి పెట్టినట్లు భావించుకుంటూ సమృద్ధిగా పాలను వర్షిస్తాయి. అట్లే సద్గురువులు కూడా శిష్యులు అడగకుండానే తమంతట తామే సదుపదేశాలను అనుగ్రహిస్తారు.
జగద్గురువులైన రామానుజాచార్యులు తమను ఎవరూ కోరకుండానే తమంతట తామే గోపురమెక్కి సర్వజనోజ్జీవనార్హమైన మంత్రాన్ని ఉపదేశించి, పరమ దయాగుణ నిధిగా ప్రఖ్యాతిగాంచినారు.
గోదాదేవి ఐదు లక్షల మంది గోపికలతో కలిసి శ్రీవ్రతాన్ని ఆచరించి తన సమకాలీనులైన వారెంద రినో ఉద్ధరించినది. దయామయురాలైన జగన్మాతయై న గోదాదేవికి సంసారార్ణవమగ్నులైన దీనులైన చేతను లను ఉద్ధరించాలనే లోకహిత భావన కలిగినది. అం దుకే వర్ణ- లింగ- వయో భేదం లేకుండా అన్ని కాలా లకు, అన్ని ప్రాంతాలకు చెందిన ఆస్తిక జనులెల్లరూ ‘శ్రీవ్రతాన్ని’ అనుష్టించి తరించుటకు ‘తిరుప్పావై’ అనే సూక్తిరత్నమాలికను లోకానికి ఉపదేశించి సద్గురువు లకు కూడా ఆదర్శప్రాయురాలై నిలిచింది. భక్తులకు ప్రాతఃస్మరణీయురాలైనది.
కులశేఖరులు ముకుంద మాలలో-
‘‘హే మర్త్యాః పరమం హితం శ్రుణుత వో వక్ష్యామి సంక్షేపతః / సంసారార్ణవ మాపదూర్మిబహుళం సమ్య క్ప్రవిశ్యస్థితాః/నానాజ్ఞాన మపాస్య చేతసి నమో నారా యణాయేత్యముం/మంత్రం సప్రణవం ప్రణామసహి తం ప్రావర్తయధ్వం ముహుః॥
ఓ మనుజులారా! ఆపదలు అనే అలలతో కూడిన సంసారమనే సముద్రంలో మునిగియున్న మీకు పరమ హితమైన విషయాన్ని సంక్షేపంగా చెప్పెదను. కాస్త శ్రద్ధ గా వినండి- మీరు భేదదృష్టిని వదిలి ‘నమో నారాయ ణాయ’ అను మంత్రానికి ఓంకారాన్ని కలిపి నమస్క రిస్తూ ప్రతినిత్యం జపించండి. తరిస్తారు అని అష్టాక్షరీ మహామంత్ర ప్రాముఖ్యాన్ని గుర్తించమని సరళంగా, సంగ్రహంగా, స్పష్టంగా, సుందరంగా ఉద్బోధించారు.
- సముద్రాల శఠగోపాచార్యులు