Guruvayur
-
గురువాయుర్ ఆలయాన్ని సందర్శించిన మోదీ
-
ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా!
తిరువనంతపురం: ఆలయానికి వెళ్లిన ఓ కొత్త జంటకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోని గజరాజు ముందు ఫోటోలు దిగాలనుకున్నారు. కానీ, ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ ఏనుగు దాడి చేసింది. ఈ వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ ‘వెడ్డింగ్ మొజిటో’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ సంఘటన కేరళ త్రిస్సూర్‌లోని గురువాయుర్ ఆలయంలో నవంబర్ 10న జరిగింది. గజరాజు ఒక్కసారిగా దాడి చేయడంతో సమీపంలోని భక్తులంతా పరుగులు పెట్టాల్సి వచ్చింది. వీడియో ప్రకారం.. కొత్త జంట మెడలో మాలలతో ఏనుగు సమీపంలోకి వెళ్లి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. వారికి గజరాజు కుడివైపున ఉంది. ఫోటోగ్రాఫర్ కెమెరాను క్లిక్ మనిపించగా.. ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. మావటి అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఎత్తి కుమ్మిపడేసింది. తొండంతో పైకెత్తేందుకు ప్రయత్నించగా కింద పడిపోయాడు. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, అతని శరీరంపై ఉన్న బట్టలను ఏనుగు లాగేసింది. ఆ తర్వాత ఏనుగుపై ఉన్న మరో మావటి దానిని అదుపు చేశాడు. తమకు ఎదురైన ఈ సంఘటనను వీడియోలో వివరించాడు పెళ్లి కొడుకు. తాము ఫోటోలు దిగుతుండగా అంతా అరుస్తూ పరుగెడుతున్నారని, తన భార్య చేతిని పట్టుకుని లాక్కెళ్లినట్లు చెప్పాడు. View this post on Instagram A post shared by Wedding Mojito (@weddingmojito) ఇదీ చదవండి: Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు -
కేరళ నాకు వారణాసితో సమానం!
గురువాయూర్ : కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేయపోయినా.. బీజేపీకి వారణాసి ఎంతో.. కేరళ కూడా అంతేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేరళ త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పళ్లు, రూపాయి నాణేలతో తులాభారం వేయించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ భగవానున్ని దర్శించుకున్నారు. అనంతరం గురువాయూర్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘మమ్మల్ని గెలిపించిన వారే కాదు.. మమ్మల్ని గెలిపించని వాళ్లు కూడా మావాళ్లే. కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయినా మోదీ ఎందుకు ఇక్కడ మొదటి రాజకీయ ప్రసంగం చేస్తున్నారని మీరు అడగవచ్చు.. నిజానికి వారణాసి ఎంతో కేరళ కూడా మాకు అంతే’ అని మోదీ అన్నారు. ఎన్నికలు ఎన్నికలు వరకేనని, దేశంలోని యావన్మందీ ప్రజల బాగోగులు చూడటం ప్రభుత్వం బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామిక పర్వదిన స్ఫూర్తిని కొనసాగించడంపై ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రజలకు నా సెల్యూట్.. వారే నా దేవుళ్లు’అని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రజలందరి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని, తాను ప్రజలందరి సేవకుడినని, గెలుపోటములకు అతీతంగా అందరి సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని మోదీ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు జనసేవకులు అని, వారు తమ జీవితమంతా ప్రజల సేవకే కట్టుబడి ఉన్నారని అభివర్ణించారు. -
గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం
సందర్శనీయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన కృష్ణాలయాల్లో ఒకటైన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం కేరళలో ఉంది. త్రిసూర్ జిల్లాలోని చిన్నపట్టణమైన గురువాయూర్‌లో గల ఈ ఆలయం ఐదువేల ఏళ్ల నాటిదని అంచనా. అయితే, ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చారిత్రక ఆధారాలూ లేవు. క్రీస్తుశకం 14-16 శతాబ్దాలకు చెందిన ‘కోకసందేశం’, ‘నారాయణీయం’ వంటి తమిళ సాహిత్య గ్రంథాలలో గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయ వర్ణన ఉంది. ప్రస్తుతం ఉన్న గర్భాలయం క్రీస్తుశకం 1638లో పునర్నిర్మాణానికి నోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లోనే ఇది దక్షిణ భారత దేశంలో ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. సర్పయాగం చేసిన జనమేజయుడు సర్పాల శాప ఫలితంగా కుష్టువ్యాధిగ్రస్థుడయ్యాడని, దత్తాత్రేయుడి సూచన మేరకు గురువాయూర్‌లో మహావిష్ణువు కోసం తపస్సు చేసి, శాపవిమోచనం పొందాడని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి ఉత్తరాన గల రుద్రతీర్థం వేల ఏళ్ల నాటి నుంచి ఉందని చెబుతారు. సాక్షాత్తు పరమశివుడు సకుటుంబ సమేతంగా ఇక్కడ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడని ప్రతీతి. శ్రీకృష్ణ జన్మాష్టమి, డోలాపూర్ణిమ సహా వైష్ణవ పర్వదినాలన్నీ ఇక్కడ వైభవోపేతంగా జరుగుతాయి. -
వెనక్కు తగ్గిన శ్రీకృష్ణా కాలేజీ
గురువాయుర్: ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక వ్యాఖ్యలపై కేరళలోని శ్రీకృష్ణా కాలేజీ వెనక్కు తగ్గింది. మోడీకి వ్యతిరేకంగా తమ క్యాంపస్ మేగజీన్ లో ప్రచురించిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అలాగే విద్యార్థులకు, కాలేజీ సిబ్బందికి పంపిణీ చేసిన మేగజీన్ ప్రతులను కూడా వెనక్కు తీసుకోవాలని కాలేజీ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. చట్టపరమైన చర్యలు, బీజేపీ ఆందోళనలకు భయపడి శ్రీకృష్ణా కాలేజీ ఈ మేరకు నిర్ణయించింది. మోడీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు స్టూడెంట్ ఎడిటర్, ప్యానల్ సభ్యులతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బెయిల్ పై విడుదలయ్యారు.