రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం
గువాహటి: గువాహటి రైల్వే స్టేషన్లో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బోగీలోని సీటు కింద ఉన్న గోనె సంచిలో 15 కిలోల బరువైన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి లుంబింగ్ ప్రాంతానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం రాజధానికి వెళ్లే అవథ్ ఎక్స్‌ప్రెస్‌లో కిలోన్నర బ్రౌన్‌షుగర్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.