యువతిని వేధిస్తున్నఎస్ఐ అరెస్ట్
విశాఖపట్నం: విజయవాడలో రిజర్వ్ ఎస్ఐగా పనిచేస్తున్న జీవీఎన్ ప్రసాద్‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో కప్పరాడలో ఉంటున్న ఓ యువతిని ఎస్ఐ మూడు రోజులుగా వేధిస్తున్నాడు. సదరు యువతి స్నేహితురాలు వారం రోజుల నుంచి కనపడటంలేదు. ఆమెను నువ్వే హత్య చేశావు.. నా కోరిక తీర్చకపోతే నిన్ను ఆ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా బుధవారం రాత్రి యువతికి ఫోన్ చేశాడు. ఫోన్లో ఎక్కడ ఉంటున్నావో చెప్పాలంటూ నిలదీశాడు.
దీంతో బెదిరిపోయిన ఆ యువతి తన అడ్రస్ చెప్పడంతో అర్థరాత్రి అక్కడకు వచ్చిన ప్రసాద్.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో పారిపోయిన యువతి స్థానికుల సాయంతో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన అధికారులు ఎస్ఐని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.