gymkhana ground in hyderabad
-
HCA డకౌట్
-
ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా!
సాక్షి, ఉప్పల్: ఈ నెల 25న ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్వహించే టీ– 20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్‌ను ఫిర్యాదు చేసింది. క్రికెట్ క్రీడాభిమానులకు టికెట్లు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లోకి తరలించడానికి హెచ్‌సీఏ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన పత్రాలతో ఏఐవైఎఫ్ ప్రతినిధులు టికెట్లతో పాటు ఆట సమయంలో తిను బండారాలు, శీతల పానీయాలను సైతం అధిక రేట్లకు విక్రయించే యత్నాలపైనా విచారణ చేపట్టాలని కోరారు. కేవలం 25 శాతం టికెట్లను ఆన్లైన్లో విక్రయించి 75 శాతం టికెట్లను బ్లాక్ మార్కెట్ చేయడానికి హెచ్‌సీఏ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఏఐవైఎఫ్ అధ్యక్షుడు వలి ఉలా ఖాద్రి, రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎన్.శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర పాల్గొన్నారు. రసూల్‌పుర: ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను రద్దు చేయాలి.. అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ను తొలగించాలి.. అజారుద్దీన్ డౌన్ డౌన్’ అంటూ క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్లో నినాదాలు చేశారు. భారత్– ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ– 20 మ్యాచ్ నేపథ్యంలో.. టికెట్ల కోసం వేలాది మంది జింఖానా మైదానానికి వచ్చారు. టికెట్లు విక్రయించాలంటూ గోడ దూకి గ్రౌండ్ లోపలికి చేరుకున్నారు. చదవండి: జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ టికెట్లు ఇచ్చేవరకూ తిరిగి వెళ్లేది లేదంటూ అక్కడే బైఠాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్ల కోసం వచ్చామని.. తీరా చూస్తే వాటిని అమ్ముకున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
IND Vs AUS: టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు పోటెత్తిన అభిమానులు (ఫొటోలు)
-
రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలి
జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జాకీర్ మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్లు విజేతగా నిలవాలని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జాకీర్ అడ్వకేట్ అన్నారు. హైదరాబాద్ జింఖానా మైదానంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు వరకు జరగనున్నS సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ఆయన జిల్లా జట్లను అభినందించారు. ఏకాగ్రత, సమష్టిగా ఆడి విజేతగా నిలవాలని కోరారు. జిల్లాలో బాస్కెట్‌బాల్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం ప్రదర్శించే క్రీడాకారులకు తమవంతు సహకారం ఉంటుందని వెల్లడించారు. ఈనెల 5న స్థానిక స్టేడియంలో సెలక్షన్ నిర్వహించి జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మీర్ అర్షద్ అలీ, డీఎస్ఏ కోచ్ ఖలీల్ పాల్గొన్నారు. బాలుర జట్టు: అఫ్రోజ్ అలీ, ఆది శేషవ్, ప్రశాంత్, సయ్యద్ ఆసిఫ్, ఎండీ ఆమేర్, ఉదయ్‌కుమార్, శివప్రసాద్, సాయిదీపక్, రోహిత్‌కుమార్, నవీన్‌కుమార్, రాంగోపాల్, శ్రీనివాస్. కోచ్, మేనేజర్లు ఎండీ ఖలీల్, మహేష్‌కుమార్. బాలికల జట్టు: ఆర్షిత, ప్రియాంక, స్వర్ణలత, తేజస్విని, రిషితారెడ్డి, సుష్మ, శ్రీలత, వందన, సంధ్యారాణి, భవాని, తనుజ, భువనేశ్వరి, హరిణి రెడ్డి, కోచ్, మేనేజర్లు శైలజ, అరవింద్.