సీబీఐ ఎస్పీగా చంద్రశేఖరన్ బాధ్యతల స్వీకారం
16న రిలీవ్కానున్న సీబీఐ డీఐజీ వెంకటేష్
సాక్షి, హైదరాబాద్: సీబీఐ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ విభాగం ఎస్పీగా చంద్రశేఖరన్ గురువారం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ ముంబై ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం(ఈవోడబ్ల్యు)లో విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖరన్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ సీబీఐ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు. మరోవైపు సీబీఐ హైదరాబాద్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న హెచ్.వెంకటేష్ ఈనెల 16వ తేదీన రిలీవ్ కానున్నారు. సొంత క్యాడర్ కేరళకు ఆయన వెళ్లనున్నారు.