hair cost
-
తలనీలాల ఆదాయం రూ.73 లక్షలు
పావగడ : స్థానిక శ్రీ శనీశ్వరాలయం అన్నదాసోహ భవనంలో గురువారం నిర్వహించిన తలనీలాల వేలంలో రూ. 73 లక్షలు ఆదాయం లభించింది. హిందూపురానికి చెందిన వేలందారులు ఆనంద్, ఆదినారాయణ వేలంలో పాల్గొని, తలనీలాలను దక్కించుకున్నారు. అదేవిధంగా భక్తులు స్నానమాచరించిన తర్వాత వదిలేసిన పాత వస్త్రాలు వేలంలో రూ 5.45 లక్షలకు వేలందారులు దక్కించుకున్నారు. కొబ్బరి వేలాన్ని వాయిదా వేశారు. వేలంలో ఎస్ఎస్కే సంఘం అధ్యక్షుడు ధర్మపాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఆనందరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
కోటి 52 లక్షలు పలికిన తలనీలాల వేలంపాట
కర్నూలు: ఆ తలనీలలు వేలంపాటలో రూ.1.52 కోట్లు పలికాయి. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని ఆర్ఎస్రంగాపురం గ్రామశివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే తలనీలాల వేలంపాట గురువారం నిర్వహించారు. కర్నూలులోని దేవాదాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ-టెండర్ వేలంపాటలో ఐదు మంది పాల్గొనగా ఆదోనికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి రూ.1.52 కోట్ల10 వేలకు దక్కించుకున్నాడు. (బేతంచర్ల)