భారత్- జపాన్ మ్యాచ్ డ్రా
డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్లో భారత్, జపాన్ మహిళల హాకీ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1తో డ్రా గా ముగిసింది. భారత్ తరఫున పూనమ్ రాణి (7వ ని.) గోల్ చేయగా... హాజుకీ నగయ్ (19వ ని.) జపాన్‌కు గోల్‌ను అందించి స్కోరును సమం చేసింది. శుక్రవారం జరిగే చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడుతుంది.