ఉచిత ప్రయాణం ఉత్తిదే!
► బస్‌పాస్ ఉంటేనే తీసుకెళ్తామంటున్న ఆర్టీసీ అధికారులు
► మేమేం చేయలేమంటున్న విద్యాశాఖ
► ఆందోళనలో పది విద్యార్థులు
నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను సైతం మోసం చేసింది. పది పరీక్షలు రాసే విద్యార్థులు కేవలం హాల్ టెకెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం అంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, తల్లి,దండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితుల్లో ఉచిత ప్రయాణం ఉత్తదేనని తేలిపోయింది. సోమవారం నుంచి పది పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 35536 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రవుతున్నారు. జిల్లాలో కొన్ని పరీక్ష కేంద్రాలు 15 నుంచి 20 కిలో మీటర్లు దూరంలో ఉన్నాయి. ప్రభు త్వ అధికారుల ఇచ్చిన ప్రకటనలో ఏ బస్సైనా ఎక్కి వెళ్లవచ్చన్న సంతోషపడ్డారు. పరీక్ష రోజు హుటాహుటిన వెళ్లి బస్సు ఎక్కి కూర్చొన్నారు.
కండక్టర్ టికెట్ అడగ్గానే 10వ తరగతంటూ హాల్ టెకెట్ చూపిం చారు. హల్‌టికెట్ ఉంటే సరిపోదని బస్‌పాస్ ఉండాలన్నారు. దీంతో విద్యార్థులు, కండక్టరుకు అక్కడక్కడా గొడవలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ అధికారులు ప్రకటనలు, చేసే పనికి పొంతన లేకుండా చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. విద్యార్ధులు గోడు పట్టించుకోక పోవడంతో చేసేదేమి లేకు టికెట్‌ను కొనుగొలు చేసి పరీక్షలు రాసేందుకు వెళుతున్నారు. ప్రధానంగా ఉదయగిరి, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో మారుమూల నుంచి విద్యార్థులు పరీక్షలకు రాసేందుకు వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మహేశ్వర్‌ను సాక్షి ప్రశ్నించగా బస్ పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారు. పాస్ ఉంటే ఏ రూట్‌కు సంబంధించి అయినా అనుమతిస్తామన్నారు. విద్యాశాఖాధికారులు ఉచిత ప్రయాణమని చెప్పారని ప్రశ్నించగా అది వారినే అడగాలని సమాధానం ఇచ్చారు.