Handicapped Pension
-
హామీలు ‘దివ్యం’.. అమలులో దైన్యం
‘దివ్యాంగుల కోసం రూ.2 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తా. ప్రత్యేక స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తా. స్కూటీలు పంపిణీ చేస్తా. రెండు చేతులు లేనివారికి నెలకు రూ.10 వేలు పింఛను. వైకల్యం గల వారికి రూ.3 వేలు పింఛను. దివ్యాంగుల సంక్షేమమే మా ధ్యేయం’అంటున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దివ్యాంగులకు చేసిందేమిటనే విషయాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ గుంటూరులో రచ్చబండ నిర్వహించింది. దివ్యాంగుల్లో ఎవరిని కదిపినా ‘మా సంక్షేమాన్ని పట్టించుకున్న నాథుడే లేడు’ అని అవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుడు మరియబాబు మాట్లాడుతూ.. ‘80 నుంచి 100 శాతం వైకల్యం ఉంటేనే రూ.3 వేలు పింఛను వస్తుందంట. ఆ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోడానికి రోజుకో షరతు పెడుతున్నారు. కొన్ని రోజులు సదరం క్యాంప్‌లు అన్నారు. మరికొన్ని రోజులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేద్దామంటే ఆ వెబ్సైట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు. మాకు చేయూత అందించడానికి కూడా షరతులేంటి సార్’ అని వాపోయాడు. ఇంతలోనే జనగం రామయ్య మాట కలుపుతూ.. ‘సర్టిఫికెట్లు ఇచ్చినా పింఛన్ రావట్లేదు. ఒక కన్ను లేక బాధపడుతున్న నేను దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. డాక్టర్లు సైతం నాకున్న వైకల్యాన్ని ధ్రువపరుస్తూ పత్రాలు ఇచ్చారు. అయినా నాకు పింఛన్ రావడం లేదు. కళ్లు కనిపించకున్నా కూలి పనులకు వెళ్తున్నానంటూ గోడు వెళ్లబోసుకున్నాడు.– వడ్డే బాలశేఖర్, సాక్షి, గుంటూరు చంద్రబాబు దగా చేశారు దివ్యాంగుల సంక్షేమానికి బడ్జెట్లో ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని మొండిచెయ్యి చూపారు. దివ్యాంగులకు జిల్లాకో హోమ్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.10 వేలిస్తామని ఇవ్వలేదు. ఇలాంటి హామీలెన్నో ఇచ్చి దివ్యాంగులను మోసం చేశారు. మమ్మల్ని టీడీపీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తోంది. – చెర్లోపల్లి రెడ్డెప్ప,కార్యదర్శి, ఏపీ దివ్యాంగుల జేఏసీ మోటార్ వాహనాల ఊసే లేదు కోటేశ్వరరావు అనే దివ్యాంగుడు మాట్లాడుతూ.. ‘మాలాంటోళ్లకు 2,500 మోటార్ వాహనాలు పంపిణీ చేస్తామని 2016 డిసెంబర్ 3న దివ్యాంగులకు చంద్రబాబు ప్రకటించారు. రెండేళ్లు వాటి ఊసేలేదు. తీరా ఎన్నికలు సమీపి స్తున్న వేళ మొక్కుబడిగా కొన్ని స్కూటీలు పంపిణీ చేశారు. అవి కూడా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు. ఇప్పుడు వాళ్లతో టీడీపీ తరఫున ప్రచారం చేయిం చుకుంటున్నారు’ అని చెప్పారు. శ్రీనివాస్ అనే మరో దివ్యాంగుడు మాట్లాడు తూ.. ‘దివ్యాంగుల చట్టం 2016ను అమలు చేయకుండా మోసం చేసింది. చట్టాన్ని అమలు చేసి కమిషన్, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని మా నాయ కులు సీఎం, మంత్రులను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. తెలంగాణ లో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయకుం డా చంద్రబాబు దివ్యాంగులను వంచించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10 వేలుఇస్తామన్నారు రెండు చేతులు లేని వారికి నెలకు రూ.10 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. నేటికీ రూ.10 వేలు పింఛన్ ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం రెండు చేతులు లేని వారికి రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు.– లక్ష్మీపతినాయుడు, దివ్యాంగుడు ఐదేళ్లలో ఇచ్చిన హామీలివీ ♦ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 2014 డిసెంబర్ 3న రాజమహేంద్రవరంలో ఇచ్చిన హామీలు ♦ దివ్యాంగుల సంక్షేమానికి ఏటా బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తాం ♦ జిల్లాలో శారీరక దివ్యాంగులకు హోమ్‌లను ఏర్పాటు చేస్తాం ♦ దివ్యాంగులకు రిజర్వేషన్లు పెంచుతాం ♦ ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం ♦ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం 2015 డిసెంబర్ 3న విజయవాడలో ఇచ్చిన హామీలు ♦ దివ్యాంగులకు విజయవాడలో స్టడీ సర్కిల్ ఏర్పాటు ♦ గుంటూరులో రూ.2.70కోట్లతో బ్రెయిలీ ప్రెస్ ఏర్పాటు చేస్తాం ♦ రూ.20కోట్లతో బాల్యంలో వైకల్యం, ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. 2016 డిసెంబర్ 3న విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇచ్చిన హామీలు ♦ ఏటా బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేస్తాం ♦ 2,500 మందికి మోటారు వాహనాలు, బ్యాటరీ వాహనాలు మంజూరు చేస్తాం. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు వారంలో మంజూరు చేయిస్తాం 2017 డిసెంబర్ 3న కర్నూలులో ఇచ్చిన వాగ్దానాలు ♦ ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ♦ కర్నూలు జిల్లాలో రూ.6.94 కోట్లతో సెన్సార్ పార్క్ నిర్మిస్తాం. -
వైకల్యం ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదు..
చీరాల అర్బన్: ‘రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో శరీరంలో ఒకవైపు నరాలు దెబ్బతిన్నాయి. ఒంగోలులో చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. కూలి పనులకు వెళ్లే నాకు అంత స్థోమత లేదు. నడవలేని స్థితిలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు’ అని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన జి.రవీంద్రబాబు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన సమస్యను చెప్పుకున్నాడు. ఇల్లు కాలిపోయినా పరిహారం అందలేదయ్యా! పీసీపల్లి: ఆరు నెలల క్రితం ప్రమాదంలో తన ఇల్లు కాలిపోయి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని అద్దంకి మండలం మొండితోటవారిపాలెంకు చెందిన మొండితోట ఏసమ్మ ప్రజా సంకల్పయాత్రలో కుంకిపాడు గ్రామం వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించింది. తన భర్త చనిపోయాడని, పింఛన్ కూడా రావడంలేదని వాపోయింది. కూలిపనులకు వెళ్లి పొట్టపోసుకుంటున్నామని వాపోయింది. -
80% వైకల్యం ఉంటేనే రూ.1500 పింఛన్
సాక్షి, హైదరాబాద్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందజేసే నెలవారీ పింఛన్‌ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వితంతువు, చేనేతలకు చెల్లించే పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచారు. 40 శాతం నుంచి 79 శాతం వరకు అంగకవైకల్యం ఉన్న వారికి వెయ్యి.. 80 శాతం, ఆపైన అంగవైకల్యం ఉండేవారికి 1,500 రూపాయలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మొన్నటి ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచుతామని ప్రకటన చేసి ఈ మేరకు తాను ప్రమాణస్వీకారం చేసే రోజు ఫైలు సంతకం చేశారు. అయితే ఎన్నికల సందర్భంగా వికలాంగులందరికీ రూ. 1500 చెల్లిస్తామని ప్రకటన చేసిన చంద్రబాబు తీరా అమలు విషయానికి వచ్చే సరికి ఆంక్షలు మొదలు పెట్టారు. ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా 40 నుంచి 79 శాతం అంగవైకల్యం ఉన్న వారు రూ.500 ఫించనును కోల్పోవాల్సి వస్తోంది. లబ్ధిదారులకు అక్టోబరులో జరిపే చెల్లింపు నుంచి పెరిగిన పింఛన్లు అమలులోకి వస్తాయని గ్రామీణాభివృద్ధి ఇన్‌ఛార్జి ముఖ్యకారదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతవులు, చేనేతలకు రూ.200, 40 శాతం పైన అంగవైకల్యం ఉన్న వికలాంగులందరికీ రూ.500 పింఛన్ ఇస్తున్నారు. -
వికలాంగులకు రూ.1200 పింఛన్ ఇస్తాం
బయ్యారం, న్యూస్‌లైన్: యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో వికలాంగులను పలు రకాలుగా ఆదుకున్నామని, వారికి అందించే పింఛన్‌ను రాబోయే రోజులలో రూ.1200కు పెంచుతామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారితశాఖ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. మంగళవారం బయ్యారంలో అలెంకో(ఆర్టిఫిషియల్ లింక్స్ మ్యాన్‌ఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ సౌజన్యంతో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 217 మంది వికలాంగులకు పలు పరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. వికలాంగుల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలో ప్రధాన నీటివనరులైన బయ్యారం పెద్ద చెరువు కాల్వల మరమ్మతులకు రూ 30 లక్షలు, తులారాం ప్రాజెక్టు కాల్వలకు రూ. 3.20 కోట్ల నిధులు విడుదలయ్యాయని చెప్పారు. వచ్చే వేసవిలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇనుపరాయి గనులున్న బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి ఎన్ఓసీ ఇవ్వటంలోనే జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ పరిశ్రమ స్థాపనకు ఎన్ఓసీ ఇవ్వాలని ఆయన సీఎంను కోరారు. ఇల్లెందు- గుండాల మధ్య రూ.100 కోట్లతో రహదారిని నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి ఆధ్వర్యంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అలెంకో సంస్థ సీఎండీ నారాయణరావు, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్, వికలాంగుల శాఖ ఏడీ మున్నయ్య, మండల ప్రత్యేకాధికారి శోభన్‌బాబు, తహశీల్దార్ పుల్లయ్య, సొసైటీ అధ్యక్షుడు బిక్షం తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ వేదన
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్న వికలాంగులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. వికలాంగులకు పింఛన్ మంజూరు కావాలంటే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు గతంలో ప్రతి రోజు సదరమ్ క్యాంప్ నిర్వహించే వారు. అక్కడే భోజన, నీటి వసతి కల్పించేవారు. ప్రస్తుతం మంగళ, బుధ వారాల్లో మాత్రమే సదరమ్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. శిబిరంలో కొద్ది మందికి మాత్రమే పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. దీంతో మిగిలిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికలాంగులకు 20 శాతం నుంచి 39 శాతం వరకూ వైకల్యం ఉన్నా రూ.200 పింఛన్ అందిస్తామని మూడో విడత రచ్చబండలో ప్రజాప్రతినిధులు ప్రకటించారు. దీంతో ధ్రువీకరణ పత్రాల కోసం శిబిరాలకు పోటెత్తుతున్నారు. మంగళవారం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన శిబిరానికీ 400 మంది వికలాంగులు హాజరయ్యారు. వీరిలో కేవలం 170 మందికి మాత్రమే పరీక్షలు చేశారు. శిబిరం వద్ద కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదు. వికలాంగులు తొలుత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పాత రిమ్స్‌లోని సదరమ్ కార్యాలయంలో పరీక్షలు చేయించుకుని పార్ట్-ఏ ఫారం తీసుకోవాలి. అక్కడ నుంచి రిమ్స్‌కు రావాలి. ఇలా ఐదు వారాలుగా రిమ్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ విషయాన్ని సదరమ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డేవిడ్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు మరికొంత మందికి పరీక్షలు చేశారు. మిగిలిన వికలాంగుల అవస్థలను వికలాంగుల నాయకుడు కాలేషా ఆ శాఖ ఏడీకి వివరించారు. వికలాంగ మహిళలకు మంగళవారం రాత్రికి సంతపేటలోని వసతి గృహంలో బస ఏర్పాటు చేశారు.