hang himself suicide
-
ఢిల్లీలో దారుణం భార్యా పిల్లలను చంపేసి తను కూడా..
సాక్షి ,న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఒక ఇంటిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపాయి. ఎంత కష్టం వచ్చిందో గానీ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తరువాత భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ సమీపాన రోహిణిలోని నాహరాపూర్‌లో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ధీరజ్ యాదవ్ బస్ డ్రైవర్‌గా ఢిల్లీ రవాణా సంస్థలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ముందు తన భార్యా పిల్లలను హత్య చేసి తరువాత ధీరజ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియలేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా లేదా అప్పల బాధ భరించలేక ఈ దారణానికి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ఆగ్రాలో దారుణం: భర్త కళ్ల ముందే భార్యను.. ) -
ఎంబిఏ విద్యార్థి ఆత్మహత్య
గ్రేటర్ నోయిడా: అనుమానస్పద స్థితిలో ఎంబిఏ విద్యార్థి మృతిచెందిన ఘటన గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్టల్లో శనివారం వెలుగుచూసింది. పోలీసులు కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన రంజిత్ అనే విద్యార్థి ఓ ప్రైవేటు కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ రూంలో రంజిత్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి చెప్పారు. దాంతో హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అతని రూంలో నిద్రమాత్రలు దొరికినట్టు పోలీసులు తెలిపారు. అయితే రంజిత్ మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యచేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు ఇంకా నమోదు చేయలేదని, రంజిత్ సహాచరులు, మిత్రులను ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.