Hannover fair
-
'3డీ'తో ప్రపంచం చూపు భారత్ వైపు
-
'3డీ'తో ప్రపంచం చూపు భారత్ వైపు
హన్నోవర్: డెమోగ్రఫీ, డెమొక్రసీ, డిమాండ్(3డీ) ఈ మూడు అంశాలు ప్రపంచం భారత్ వైపు చూసేలా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ దేశంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెట్టుబడులు పెట్టాలని విదేశీ ఇన్వెస్టర్లను కోరారు. జర్మనీ హన్నోవర్లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంక్లిష్టంగా ఉన్న పన్నుల విధానాన్ని ఎత్తివేశామని వెల్లడించారు. పన్నుల విధానాన్ని సరళీకరిస్తామని తమ ప్రభుత్వ మొదటి బడ్జెట్ లోనే పేర్కొన్నామని తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే పాత భావనలను అవసరమైతే వదులుకునేందుకు వెనుకాడబోమని మోదీ స్పష్టం చేశారు. -
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ
హన్నోవర్: జర్మనీ హన్నోవర్లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శను ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెల్ మోర్కెల్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భారతీయ స్టాల్ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తయారీ రంగంలో ప్రపంచానికి భారత్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులపై ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ఈ సదస్సులో తమ దేశానికి భాగస్వామ్యం కల్పించినందుకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాననీ, ఇందుకోసం జర్మనీతోపాటు ప్రపంచదేశాలు ముందుకురావాలని ఆయన కోరారు. నాలుగు వందల భారత కంపెనీలు పాల్గొంటున్న ఈ ప్రదర్శనలో నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. అయితే కాగా మూడు దేశాల్లో తొమ్మది రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ పర్యటనను ఇప్పటికే ముగించిన ప్రధాని మోదీ జర్మనీలో రెండురోజుల పర్యటన అనంతరం కెనడాకు బయలుదేరి వెళ్ళనున్నారు.