పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ | Modi, Merkel inaugurate India pavilion at Hannover fair | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ

Published Mon, Apr 13 2015 2:08 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ - Sakshi

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ

హన్నోవర్:  జర్మనీ హన్నోవర్లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శను  ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్   ఏంజెల్ మోర్కెల్  ప్రారంభించారు.  ఈ  ప్రదర్శనలో భారతీయ స్టాల్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ   తయారీ రంగంలో ప్రపంచానికి భారత్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులపై ప్రపంచ దేశాలన్నీ  భారత్ వైపు  చూస్తున్నాయన్నారు.    ఈ సదస్సులో తమ దేశానికి భాగస్వామ్యం కల్పించినందుకు  ప్రధాని సంతోషం వ్యక్తం  చేశారు.  భారత్‌ లో  పెట్టుబడులు పెట్టేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాననీ, ఇందుకోసం జర్మనీతోపాటు ప్రపంచదేశాలు ముందుకురావాలని ఆయన కోరారు. నాలుగు వందల భారత కంపెనీలు  పాల్గొంటున్న ఈ  ప్రదర్శనలో నిర్మలా సీతారామన్  కూడా హాజరయ్యారు. అయితే
కాగా  మూడు దేశాల్లో తొమ్మది రోజుల పర్యటనలో భాగంగా  ఫ్రాన్స్ పర్యటనను  ఇప్పటికే ముగించిన ప్రధాని మోదీ జర్మనీలో రెండురోజుల పర్యటన అనంతరం కెనడాకు బయలుదేరి వెళ్ళనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement