నటుడు హరనాథ్ భార్య మృతి
చెన్నై : దివంగత నటుడు హరనాథ్ సతీమణి భానుమతి దేవి (70) శనివారం చెన్నైలో మృతి చెందారు. హరనాథ్‌కు భార్య భానుమతి దేవి, ఇద్దరు పిల్లలు శ్రీనివాస రాజు, పద్మజ ఉన్నారు. 1984లో హరనాథ్ కన్ను మూశారు. తదనంతరం శ్రీనివాసరాజు తొలి ప్రేమ, చిరుజల్లు వంటి చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.
ఆయన సోదరి పద్మజ నిర్మాత జీవీజీ రాజు భార్య. కోనసీమకు చెందిన భానుమతి జమీందారి కుటుంబంలో జన్మించారు. చెన్నైలోని కుమారుడు శ్రీనివాసరాజు ఇంట్లో ఆమె ఉంటున్నారు. వ యో భారంతో ఆమె శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఉన్న కుమార్తెకు సమాచారం అందించారు. చెన్నై వలసరవాక్కంలోని నివాసంలో భౌతిక కాయాన్ని ఆప్తుల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం ఉదయం పది గంటలకు పోరూర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.