hari javaharlal
-
‘వారం రోజుల్లో ఆర్థిక సాయం అందేలా చూస్తాం’
సాక్షి, విజయనగరం : బంగ్లాదేశ్ చెర నుండి విడుదలైన 8 మంది మత్స్యకారులు మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ ఎం హరిజవహార్‌లాల్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు వీరిని కలెక్టర్ కార్యాలయంలోకి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విడుదలైన మత్స్యకారుల కుటుంబాలకు ప్యాకేజ్ రూపంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మంజూరు అయ్యే అవకాశం ఉందని, మరమ్మతులకు గురైన బోటు పునరుద్ధరించేందుకు కూడా సహాయం అందించేందుకు ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. విడుదలైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి మత్స్యకారుల సహాయం అంశం తీసుకువెళ్ళి ఆర్థిక ప్యాకేజ్ మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం మత్స్యకారుల విడుదల కోసం కృషి చేసిన వాసుపల్లి జానకిరామును జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బడ్డుకొండ సత్కరించారు. -
పూరింట్లో కలెక్టర్
గజపతినగరం : ఇక్కడ పూరింట్లో మంచంపై కూర్చున్నదెవరో తెలుసా... సాక్షాత్తూ జిల్లా కలెక్టరే. గజపతినగరం మండలంలో పర్యటనకు వచ్చిన ఆయన అక్కడి దిగువ వీధిలో ఉన్న హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ దారి లో గంట్రేటి లక్ష్మి అనే వృద్ధురాలు కలెక్టర్ హరిజవహర్ లాల్‌ను కలసి తాను నివాసం ఉంటున్న ఇంటి కి పట్టా ఇప్పించాలని ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగలేదని చెప్పగా వెంటనే ఆయన ఆమె గుడిసెలోకి వెళ్లి మంచంపై కూ ర్చుని ఆమె కష్టసుఖాలు తెలుసుకున్నారు. అంతేగాదు తహసీల్దార్ శేషగిరికి ఫోన్ చేసి తక్షణమే ఆమెకు పట్టామంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో ఆమె ఉబ్బి తబ్బిబ్బయ్యింది. -
నాణ్యమైన సరుకులు అందించాలి : జేసీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: అమ్మహస్తం పథం కింద లబ్ధిదారులకు నాణ్యమైన తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. జేసీ బుధవారం తన చాంబర్లో పౌరసరఫరాల శాఖ గోదాముల ఇన్‌చార్జ్‌లు, డీలర్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సమావేశమై మాట్లాడారు. అమ్మహస్తం కింద నాణ్యమైన సరుకులను మాత్రమే చౌకధర దుకాణాలకు చేరవేయాలని, ఈ విషయంలో అలసత్వాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అవసరానికి తగినట్లుగా ముందే ట్రాన్సుపోర్టుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. డిమాండ్ అవసరాలను బట్టి కందిపప్పు, చక్కెర, గోధుమలు వినియోగదారులకు అందించాలని కోరారు. మండల గోదాముల స్థాయిలో స్టాకు వివరాలను ఎప్పటికపుడు సెల్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో తెలియజేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్లైన్ ద్వారా స్టాకు వివరాలు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్, ఎండీకి నివేదికలు పంపాలని ఆదేశించారు. 17 గోదాములకు గాను 5 గోదాముల స్థాయిలో ఆన్లైన్ ద్వారా స్టాకు వివరాలు పర్యవేక్షిస్తున్నామని, మిగిలిన వారందరూ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. దీపం పథకం కింద సాధారణ కోటాగా 14,400 మంజూరుకాగా, 7253 గ్రౌండింగ్ పూర్తిచేశామని, మిగిలిన 7220 దీపం కనెక్షన్ల గ్రౌండింగ్‌కై చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ సీడింగ్ కార్యక్రమంలో రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నామని త్వరలో పెండింగ్‌లో ఉన్న ఆధార్ సీడింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఎస్వో నాగేశ్వర్రావు, ఏఎస్వో వెంకటేశ్వర్లు, ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.