ఆ గొడవలతో యూపీకి ఏం లాభం: రాజనాథ్ సింగ్
డియోరియా: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ నేతల అంతర్గత కుమ్ములాటలపై కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం డియోరియాలో దివంగత ఎంపీ హరికేవల్ ప్రసాద్ 'శ్రద్ధాంజలి సభ'లో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 'ఉదయాన్నే వార్తా పత్రికలు చదువుతున్న ప్రజలకు ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాలో లేక ఇతర మంచి విషయాలో కావాలి. ఇక్కడ మాత్రం అధికారంలో ఉన్న పార్టీ నేతల గొడవలు చదువుతున్నారు. వీరి గొడవల వలన ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలుగుతుంది' అని ప్రశ్నించారు.
సమాజ్‌వాదీ పార్టీ నేతల గొడవలకు సంబంధించిన విషయాలను తాను తెలుసుకోవడం లేదని, ఇతరుల గొడవలకు సంబంధించిన విషయాలను గమనించడానికి తాను న్యాయాధికారిని కాదని తనకు తెలుసని రాజనాథ్ అన్నారు. ములాయం సీంగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్, కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ల మధ్య రాజకీయ ఆదిపత్య పోరు తలెత్తిన నేపథ్యంలో రాజనాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.