హరీశ్‌రావత్ కార్యదర్శిపై వేటు
డెహ్రాడూన్: ‘లిక్కర్ లెసైన్సు’ల అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్ వ్యక్తిగత కార్యదర్శి మొహమ్మద్ షాహిద్‌పై వేటు పడింది. లిక్కర్ లెసైన్సుల మంజూరు కోసం లంచం ఇవ్వాలంటూ మొహమ్మద్ షాహిద్ ఓ మధ్యవర్తితో మంతనాలు చేసినట్లుగా రహస్య ఆపరేషన్ వీడియోలు బయటపడిన విషయం తెలిసిందే. సీఎం హరీశ్రావతే ఈ అవినీతి వ్యవహారాన్ని నడిపాడంటూ బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో మొహమ్మద్ షాహిద్‌ను బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘లిక్కర్ లెసైన్సు’ల వ్యవహారంలో పారదర్శకంగా విచారణ జరిగేందుకు తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని షాహిద్ కోరారని, దాంతోపాటు సీఎం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అందులో పేర్కొంది.