హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి
అశ్వాపురం: హరితహారం పథకంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై మొక్కలు నాటాలని మణుగూరు క్లస్టర్ సీనియర్ హెల్త్ ఆఫీసర్ వీరబాబు, జెడ్పీటీసీ తోకల లత, తహసీల్దార్ కుసుమ, ఎంపీడీఓ శ్రీదేవి అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అశ్వాపురం సర్పంచ్ బాణోత్ శారద, ఎంపీటీసీ ఇస్లావత్ నాగ, పీహెచ్ఎన్ కాంతమ్మ, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.