తన గురించి ఒక్క వాక్యం కూడా చెప్పను!
గలగలా పారే గోదావరిలా బిపాసా బసు చాలా యాక్టివ్‌గా ఉంటారు. నాన్‌స్టాప్‌గా మాట్లాడటం ఆమెకు చాలా ఇష్టం. కానీ, ఈ మధ్య మాటలు తగ్గించేశారు. ముఖ్యంగా తన లవ్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. నటుడు హర్మాన్ బవేజాతో బిపాసా ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఈ విషయాన్ని బాహాటంగానే ప్రకటించేశారు కూడా.
జాన్ అబ్రహాంతో దాదాపు పదేళ్లు సహజీవనం చేసిన ఆమె, హర్మాన్‌తో బంధాన్ని మూడు ముళ్లతో పటిష్టం చేసుకోవాలనుకుంటున్నారు. ఫైనల్‌గా తను ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నానో అలాంటి వ్యక్తే తన జీవిత భాగస్వామి కాబోతున్నాడని, తనకన్నా హర్మాన్ మంచి మనిషి అని బిపాసా ట్విట్టర్లో పెట్టారు. హర్మాన్ గురించి ఇతర విశేషాలేమైనా చెబుతారా? అని ఇటీవల ఓ విలేకరి అడిగితే.. అస్సలు చెప్పనని నిర్మొహమాటంగా చెప్పారట బిపాసా.
తమ బంధం గురించి ఏదైతే చెప్పాలనుకున్నానో అది ట్విట్టర్లోనే చెప్పేశానని, వేరే ఏ విషయలూ చెప్పనని, ప్రస్తుతానికి నిశ్శబ్దమే శ్రేయస్కరమని అన్నారట. జాన్‌తో ఎఫైర్ సాగించినప్పుడు, దాని గురించి ఎక్కువగా మాట్లాడేవారు బిపాసా. ఆ బంధం బెడిసికొట్టింది కాబట్టి, హర్మాన్‌తో అలా జరగకూడదనే ఆచి తూచి మాట్లాడాలని ఫిక్స్ అయ్యారని ఊహించవచ్చు.